
The Girl Friend: రష్మిక మందన్నా రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది గర్ల్ ఫ్రెండ్'.. రిలీజ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన ఫ్యాన్స్‌ను మళ్లీ అలరించడానికి రెడీ అవుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ది గర్ల్ ఫ్రెండ్'లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో హీరోగా దీక్షిత్ శెట్టి నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చివరగా, చిత్ర యూనిట్ ఒక కీలక సమాచారం వెల్లడించింది. సినిమా నవంబర్ 7న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Details
అభిమానుల్లో ఆనందం
ఈ ప్రకటనతో రష్మిక అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంలో రష్మిక-విజయ్ దేవరకొండ ఎంగేజ్‌మెంట్ వార్తలు బయటకు రావడం, వెంటనే ఆమె కొత్త సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 'ది గర్ల్ ఫ్రెండ్'పై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. సినిమాకు రొమాంటిక్ టచ్‌తోపాటు ఎమోషనల్ కనెక్ట్ కూడా బలంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రష్మిక కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందో లేదో చూడాల్సి ఉంది.