LOADING...
Mass Jathara: రవితేజ - శ్రీలీల రొమాంటిక్ సాంగ్ 'హుడియో.. హుడియో' ప్రోమో రిలీజ్ 

Mass Jathara: రవితేజ - శ్రీలీల రొమాంటిక్ సాంగ్ 'హుడియో.. హుడియో' ప్రోమో రిలీజ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2025
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ, క్రేజీ హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'మాస్ జాతర'. సినిమా ప్రమోషన్లలో భాగంగా, మేకర్స్ తాజాగా రొమాంటిక్ పాట ప్రోమోను విడుదల చేశారు. 'హుడియో.. హుడియో' పాట స్పెషల్ విశేషాలు ఈ రొమాంటిక్ బీట్స్‌తో సాగే పాట యూత్‌ను ఆకర్షించేలా ఉంది. శ్రీలీల లంగావోణీలో కనిపించి, విజువల్స్‌ను మరింత ఎంటర్టైనింగ్‌గా తీర్చారు. ఈ పాటకు సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) స్వయంగా గాత్రం కూడా ఇచ్చారు. అలాగే హేషమ్ అబ్దుల్ వహాబ్ కూడా వాయిస్‌లో పాల్గొన్నారు. పాటకు దేవ్ లిరిక్స్ అందించారు. పూర్తి పాటను చిత్ర బృందం అక్టోబర్ 8న విడుదల చేయనుంది.

Details

చిత్రం విడుదల, షూటింగ్ & ప్రమోషన్స్

భాను బోగవరపు దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో, మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌లో ప్రత్యేక జోరు పెంచారు. సినిమా నుంచి వరుసగా అప్‌డేట్స్ విడుదల చేస్తూ హైప్‌ని క్రియేట్ చేస్తున్నారు.