రూల్స్ రంజన్: దేఖో ముంబై పాటను లాంచ్ చేసిన మాస్ మహారాజా రవితేజ
ఈ వార్తాకథనం ఏంటి
కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా కనిపిస్తున్న రూల్స్ రంజన్ సినిమా నుండి ఈరోజు నాలుగవ పాట రిలీజైంది.
దేఖో ముంబై అనే పాటను మాస్ మహారాజా రవితేజ విడుదల చేసారు. దేఖో ముంబై పాటను అద్నాన్ సమీ, ప్రయాల్ దేవ్ పాడారు. అమ్రిష్ సంగీతం అందించగా, సాహిత్యాన్ని కాసర్ల శ్యామ్, మేఘ్ ఉల్ వాట్ అందించారు.
ఇప్పటివరకు విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సమ్మోహనుడా అనే పాటకు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ దక్కాయి. ఇటు రీల్స్ లోనూ ఈ పాటకు రెస్పాన్స్ అదిరిపోతుంది.
రాతినం క్రిష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో దివ్యాంగ్ లావనియా, మురళీక్రిష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 6న విడుదలవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దేఖో ముంబై పాటను లాంచ్ చేసిన రవితేజ
My best wishes to the whole team of #RulesRanjann 🤗👍🏻
— Ravi Teja (@RaviTeja_offl) September 19, 2023
Here’s #DhekhoMumbai :) https://t.co/t5SyqByO8m@Kiran_Abbavaram @iamnehashetty @rathinamkrish @AMRathnamOfl