LOADING...
Nani: వేసవి విడుదలకు సిద్ధం.. షేర్‌ ఆయా'తో హైప్‌ పెంచుతున్న 'ది ప్యారడైజ్‌'
వేసవి విడుదలకు సిద్ధం.. షేర్‌ ఆయా'తో హైప్‌ పెంచుతున్న 'ది ప్యారడైజ్‌'

Nani: వేసవి విడుదలకు సిద్ధం.. షేర్‌ ఆయా'తో హైప్‌ పెంచుతున్న 'ది ప్యారడైజ్‌'

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2026
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న చిత్రాల్లో 'ది ప్యారడైజ్‌' ఒకటి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పరిచయ గీతం చిత్రీకరణ జరుగుతోంది. 'ఆయా షేర్‌...' అంటూ సాగే ఈ పాటను కథానాయకుడు నానితో పాటు వందలాది మంది డ్యాన్సర్ల నేపథ్యంతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. నాని హీరోగా, శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. విజయవంతమైన 'దసరా' తర్వాత ఇదే కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Details

ప్రత్యేక ఆకర్షణగా నాని లుక్

ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో ఈ పరిచయ గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరపరిచిన ఈ పాటకు సుధన్‌ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని లుక్‌ పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. అలాగే ఈ పరిచయ గీతం సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. రాఘవ్‌ జుయల్‌, సంపూర్ణేశ్‌ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సీహెచ్‌ సాయి అందిస్తుండగా, కూర్పు బాధ్యతలను నవీన్‌ నూలి నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్‌ డిజైన్‌ను అవినాష్‌ కొల్లా అందిస్తున్నారు.

Advertisement