Loading...
The PARADISE : మరికొన్ని గంటల్లోనే రిలీజ్‌.. 'ది ప్యారడైజ్‌' సెకండాఫ్‌ కంటెంట్‌పై టెన్షన్
మరికొన్ని గంటల్లోనే రిలీజ్‌.. 'ది ప్యారడైజ్‌' సెకండాఫ్‌ కంటెంట్‌పై టెన్షన్

The PARADISE : మరికొన్ని గంటల్లోనే రిలీజ్‌.. 'ది ప్యారడైజ్‌' సెకండాఫ్‌ కంటెంట్‌పై టెన్షన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ చిత్రం 'ది ప్యారడైజ్‌' మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా ఓవర్‌సీస్‌ కంటెంట్‌ విషయంలో ఇంకా చివరి నిమిషం పనులు కొనసాగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఓవర్‌సీస్‌ కంటెంట్‌ పూర్తిగా వెళ్లకపోవడంతో ప్రింట్‌ డెలివరీ కాలేదు. ప్రస్తుతం జెట్‌ స్పీడ్‌తో వర్క్స్‌ పూర్తి చేసి.. కంటెంట్‌ను లోడ్‌ చేసే ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నారు.

వివరాలు

ఫస్ట్‌ హాఫ్‌ కంటెంట్‌ లాక్‌..

సినిమాకు సంబంధించిన తెలుగు కంటెంట్‌లో మొదటి సగాన్ని లాక్‌ చేసి లోడ్‌ చేసి ఇచ్చేశారు.

ఈ కంటెంట్‌ను సినిమా విడుదలకు ప్లాన్‌ చేసిన అన్ని ఎలక్ట్రానిక్‌ లొకేషన్లకు పంపించే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది.

అయితే సినిమా సెకండాఫ్‌ కంటెంట్‌ మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుతం ద్వితీయార్థానికి సంబంధించిన ఫైనల్‌ కరెక్షన్స్‌ జరుగుతున్నాయి.

దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల నిమిషం కూడా గ్యాప్‌ తీసుకోకుండా సినిమా పనుల్లో నిమగ్నమయ్యారు.

వివరాలు

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు కూడా రాలేదు..

సినిమా పనుల విషయంలో శ్రీకాంత్‌ ఓదెల ఎంత బిజీగా ఉన్నారో ఆయన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హాజరుకాకపోవడం ద్వారా అర్థమవుతోంది.

గత రాత్రి జరిగిన 'ది ప్యారడైజ్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు కూడా ఆయన రాలేదు. ఈ సమయంలోనూ సినిమా కంటెంట్‌ పనులను దగ్గరుండి చూసుకుంటూ బిజీగా ఉన్నారు.

మరికొన్ని గంటల్లో క్యూబ్‌లో సెకండాఫ్‌ లోడ్‌

మరికొన్ని గంటల్లో సెకండాఫ్‌ ఫైనల్‌ కంటెంట్‌ను క్యూబ్‌లో లోడ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

కంటెంట్‌ అందిన తర్వాత మాస్టరింగ్‌ పూర్తి చేసి అప్‌లోడ్‌ చేయడానికి క్యూబ్‌కు సుమారు 4 నుంచి 5 గంటల సమయం పట్టనుంది.

ఆ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఓవర్‌సీస్‌లోని అన్ని డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌ థియేటర్‌ లొకేషన్లకు తెలుగు కంటెంట్‌ను సాయంత్రం లోగా చేరవేయనున్నారు.

ADVERTISEMENT

వివరాలు

హార్డ్‌డిస్క్‌ లొకేషన్లకు ఎప్పుడు?

హార్డ్‌డిస్క్‌ల ద్వారా సినిమా కంటెంట్‌ను ప్రదర్శించే ఓవర్‌సీస్‌ లొకేషన్లకు మాత్రం ఈ రోజు రాత్రి లేదా బుధవారం ఉదయానికల్లా హార్డ్‌డ్రైవ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇక ఇతర భాషలైన తమిళం, హిందీ, మలయాళం, కన్నడ కంటెంట్‌ గురువారం వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దీంతో మిగిలిన భాషల్లో ప్లాన్‌ చేసిన కొన్ని షోలు క్యాన్సిల్‌ అయ్యే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది.

మొత్తంగా 'ది ప్యారడైజ్‌' ఓవర్‌సీస్‌ రిలీజ్‌కు ముందు చివరి నిమిషం పనులు కొనసాగుతుండటంతో.. కంటెంట్‌ సకాలంలో అన్ని లొకేషన్లకు చేరుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

ADVERTISEMENT