
వివేకా హత్య విషయంలో నిజం ఛానల్ ద్వారా నిజాలు బయటపెడతానంటున్న రామ్ గోపాల్ వర్మ
ఈ వార్తాకథనం ఏంటి
సంచలనాలకు కేరాఫ్ గా నిలిచే తెలుగు సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తాజాగా మరో సంచలనంతో ముందుకు వచ్చాడు.
చాలా రోజులుగా సినిమాలు తీయడం తగ్గించేసిన వర్మ, ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ ని తీసుకొస్తున్నాడు.
నిజం అనే పేరుతో మొదలవబోతున్న ఈ ఛానెల్ లో అబద్ధాల బట్టలూడదీస్తాడట.
వివేకా హత్య వెనుక నిజంలో అబద్ధాలు:
మొదటి ఎపిసోడ్ గా వివేకా హత్య విషయంలోని అబద్ధాలను చూపించడానికి రెడీ అవుతున్నానంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు వర్మ. ఏప్రిల్ 25వ తేదీన సాయంత్రం 4గంటలకు మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుందని తెలియజేసాడు.
నిజం ఛానెల్ ముఖ్య ఉద్దేశ్యం అబద్ధాల బట్టలు ఊడదీయడానికేనని, అప్పుడే నిజం తాలూకు పూర్తి నగ్నత్వం బయటపడుతుందని అన్నాడు.
Details
హోస్టుగా వ్యవహరించనున్న రామూయిజం స్వప్న
నిజం"ఛానల్ లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా కొన్ని కరెంట్ సిట్యుయేషన్స్, సైన్స్, హిస్టరీ, ఆర్టీషియల్ ఇంటెలిజెన్స్, శృంగారం, ఫిలాసఫీ, పోలీస్, క్రైం, న్యాయ స్థానాలు ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయని అన్నాడు వర్మ.
ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఎక్స్ పర్ట్స్, రీసెర్చర్స్.. ఛానెల్ లో కనిపిస్తారట. రామూయిజం సిరీస్ లో కనిపించే స్వప్న, ఈ ఛానెల్ హోస్ట్ గా వ్యవహరిస్తుందట.
వివేకా మర్డర్ వెనక నిజం లోని అబద్ధాలు ఎపిసోడ్ లో, అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, వాటన్నింటి వెనుక అసలు నిజాలన్నింటినీ తవ్వి తీసి నిజం ఛానెల్ లో చూపిస్తామని అన్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిజం ఛానెల్ ని ప్రకటించిన ఆర్జీవీ
నేను ప్రారంభించబోయే”నిజం" YouTube ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడానికి.. ఆ బట్టలూడదీసి విసిరి పారెస్తేనే , నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది…నిజం చానల్ లాంచ్ 25th 4 pm https://t.co/O5T2WUf0lg#RGVNijam pic.twitter.com/KrLHuZAvS7
— Ram Gopal Varma (@RGVzoomin) April 24, 2023