Loading...
Rishab Shetty: 'టాక్సిక్' ఓ సాహసోపేత ప్రయోగం.. యశ్‌పై రిషబ్ శెట్టి ప్రశంసలు
'టాక్సిక్' ఓ సాహసోపేత ప్రయోగం.. యశ్‌పై రిషబ్ శెట్టి ప్రశంసలు

Rishab Shetty: 'టాక్సిక్' ఓ సాహసోపేత ప్రయోగం.. యశ్‌పై రిషబ్ శెట్టి ప్రశంసలు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 30, 2026
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాకింగ్ స్టార్ యశ్‌ (Yash) నటించిన తాజా చిత్రం 'టాక్సిక్' (Toxic) ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మాత్రం యశ్‌కు, 'టాక్సిక్'కు మద్దతు లభిస్తోంది. తాజాగా 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి (Rishab Shetty) 'టాక్సిక్' సినిమాతో పాటు యశ్ నటనను ప్రశంసించారు. ఈ సినిమా ఓ సాహసోపేతమైన ప్రయోగమని పేర్కొన్నారు. ఈ మేరకు రిషబ్ శెట్టి ఎక్స్‌ వేదికగా సుదీర్ఘమైన పోస్ట్‌ చేశారు.

వివరాలు

తెరపై బలమైన వ్యక్తి పోరాటం..

''ఒక నటుడిగా ఏదైనా పాత్రను పోషిస్తున్నప్పుడు.. దానికి పూర్తి స్థాయిలో ప్రాణం పోసేందుకు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాం.

ఒక బలమైన వ్యక్తి పోరాటాన్ని తెరపై చూపించిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమా కథ, పాత్రల ప్రయాణం సాధారణ సినిమాల మాదిరిగా కమర్షియల్‌ పంథాలో సాగకపోవచ్చు.

అంతమాత్రాన వారు ఎంచుకున్న మార్గం తప్పు అని కాదు. ఒక ఆలోచనను సినిమాగా మలిచి, దాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక ఎంతో కష్టం, భారీ శ్రమ ఉంటాయి'' అని రిషబ్ శెట్టి పేర్కొన్నారు.

వివరాలు

రిషబ్ శెట్టికి ప్రత్యేక అభినందనలు..

'టాక్సిక్'లోని పాత్ర కోసం యశ్ పడిన కష్టాన్ని రిషబ్ శెట్టి ప్రత్యేకంగా అభినందించారు.

ఇది ఒక సాహసోపేతమైన ప్రయోగమని పేర్కొంటూ.. యశ్‌కు తాను ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు.

''కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న నీ తపనను మేం ప్రేమిస్తున్నాం'' అంటూ యశ్‌ను ఉద్దేశించి రిషబ్ శెట్టి పోస్ట్ చేశారు.

ADVERTISEMENT

వివరాలు

నిర్మాతలకు కూడా రిషబ్ శెట్టి శుభాకాంక్షలు..

అదే సమయంలో 'టాక్సిక్' దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌ (Geetu Mohandas), నిర్మాతలకు కూడా రిషబ్ శెట్టి శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు కన్నడ అగ్ర హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్‌ కూడా 'టాక్సిక్' సినిమాకు, యశ్‌కు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.

కాగా, 'కేజీఎఫ్' ఫ్రాంచైజీ తర్వాత యశ్ నటించిన సినిమా కావడంతో 'టాక్సిక్'పై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ప్రేక్షకులు ఆశించిన రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉండటం, ఇతర కొన్ని కారణాలతో సోషల్ మీడియాలో 'టాక్సిక్'పై చర్చ కొనసాగుతోంది.

ADVERTISEMENT