Romanchakam Review : 'రోమాంచకం' మూవీ రివ్యూ.. సుమంత్ ప్రభాస్ సినిమా ఎలా ఉందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సుమంత్ ప్రభాస్ హీరోగా, అనంతిక సునీల్ కుమార్ హీరోయిన్‌గా తెరకెక్కిన తాజా చిత్రం 'రోమాంచకం'. సందీప్ రెడ్డి వంగా సొంత ప్రొడక్షన్ అయిన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్‌తో ఈ సినిమా విడుదలకు ముందే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగా నచ్చింది. దీంతో సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే 'రోమాంచకం' ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
వివరాలు
రోమాంచకం కథ ఏంటంటే..
హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఓ డేటింగ్ యాప్‌ను రూపొందించాలని ప్రయత్నిస్తుంటాడు.
తన కలను నెరవేర్చుకునేందుకు కష్టపడుతూనే.. తన నలుగురు స్నేహితుల గ్యాంగ్‌తో కలిసి సరదాగా గడుపుతుంటాడు.
తన డేటింగ్ యాప్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకునే క్రమంలో మరో డేటింగ్ యాప్‌లో మైథిలి (అనంతిక) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది.
చెన్నైలో ఉండే మైథిలితో అన్వేష్ క్రమంగా సన్నిహితంగా మారతాడు. ఇద్దరి మధ్య బంధం కూడా పెరుగుతుంది.
మైథిలి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని అన్వేష్ ఏకంగా చెన్నైకి వెళ్తాడు.
మైథిలి అతన్ని కలుస్తానని చెప్పి.. ఫోన్‌లో బ్లాక్ చేస్తుంది. దీంతో అన్వేష్‌కు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. తీవ్ర గందరగోళంలో హైదరాబాద్‌కు తిరిగి వస్తాడు.
వివరాలు
ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి ఏం చేశారంటే..
చాలాకాలం పాటు మైథిలి ఎందుకు అలా చేసిందనే ఆలోచనలోనే ఉంటాడు అన్వేష్. ఇంతలో అనూహ్యంగా మైథిలి ఫోన్ చేసి తాను హైదరాబాద్ వస్తున్నానని చెబుతుంది.
అంతేకాదు.. అన్వేష్ సిద్ధం చేసిన ఓ ఫ్లాట్‌లో రెండు రోజుల పాటు ఉంటానని కూడా చెబుతుంది.
అయితే అన్వేష్ ఓ పని మీద బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి మైథిలి అక్కడ ఉండదు.
పైగా ఓ సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోతుంది. దీంతో షాక్‌కు గురైన అన్వేష్.. మైథిలి ఎక్కడికి వెళ్లిందో, అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుందో తెలుసుకునేందుకు తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి హైదరాబాద్ అంతా వెతకడం మొదలుపెడతాడు.
వివరాలు
సినిమా బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే..
ఇంతకీ మైథిలి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది? చెన్నై వెళ్లిన అన్వేష్‌ను కలవకుండా అతని ఫోన్‌ను ఎందుకు బ్లాక్ చేసింది?
హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత అన్వేష్‌ను కలిసిన మైథిలి.. మళ్లీ సూసైడ్ చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకుంది?
అసలు మైథిలి ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి? దాన్ని అన్వేష్ పరిష్కరించగలిగాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.