NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఫోటోను క్రాప్ చేసి షేర్ చేసారు.. పెళ్ళి ఫోటోపై సాయి పల్లవి స్ట్రాంగ్ రిప్లై 
    తదుపరి వార్తా కథనం
    ఫోటోను క్రాప్ చేసి షేర్ చేసారు.. పెళ్ళి ఫోటోపై సాయి పల్లవి స్ట్రాంగ్ రిప్లై 
    పెళ్ళి ఫోటోపై స్పందించిన సాయి పల్లవి

    ఫోటోను క్రాప్ చేసి షేర్ చేసారు.. పెళ్ళి ఫోటోపై సాయి పల్లవి స్ట్రాంగ్ రిప్లై 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 23, 2023
    10:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద అనేక రూమర్స్ వస్తుంటాయి. అలాంటి రూమర్స్ హీరోయిన్ సాయి పల్లవి కూడా గతంలో చాలా వచ్చాయి.

    కానీ గత రెండు రోజులుగా సాయి పల్లవి పెళ్లి అయిపోయిందని, తమిళ దర్శకుడు రాజ్ కుమార్ పెరియార్ స్వామితో ఆమె వివాహం అయ్యిందని, అందుకు సంబంధించిన పెళ్లి ఫోటో ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒకానొక ఫోటో వైరల్ అయింది.

    ఆ ఫోటోలో సాయి పల్లవి, రాజ్ కుమార్ పెరియార్ స్వామి మెడలో దండలు కనిపించడంతో చాలామంది ఇది నిజమని అనుకున్నారు. తాజాగా ఈ విషయంపై సాయి పల్లవి ఘాటుగా స్పందించారు.

    Details

    కావాలనే చేసారంటూ సాయి పల్లవి కామెంట్స్ 

    ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోపై స్పందించిన సాయి పల్లవి ఇలా మాట్లాడారు.

    సాధారణంగా తనపై వచ్చే రూమర్స్ ని తాను పట్టించుకోను, కానీ తన కుటుంబ సభ్యులను, స్నేహితులను ఇబ్బందికి గురిచేస్తున్న ఈ రూమర్ పై స్పందించాల్సి వస్తోందన్నారు.

    ఒక సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను క్రాప్ చేసి, కావాలనే వైరల్ చేశారని పల్లవి స్పష్టం చేశారు.

    సినిమా అప్డేట్‌లకు సంబంధించిన విషయాలను పంచుకోవాల్సిన తాను ఈరోజు ఇలాంటి అనవసరమైన విషయం గురించి షేర్ చేయాల్సి వస్తోందన్నారు.

    ఇలాంటి చర్యకు పాల్పడడం అత్యంత నీచం అంటూ సాయి పల్లవి స్పందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సాయి పల్లవి
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Muhammad Yunus: మరోసారి ఈశాన్య రాష్ట్రాలపై నోరు పారేసుకున్న ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్
    BSF Jawan: బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాకిస్థాన్ భారతదేశం
    Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో 9,500 బంకర్లు..! జమ్ముకశ్మీర్
    Miss World 2025: చార్మినార్‌.. లాడ్‌బజార్‌లో సుందరీమణుల షాపింగ్‌.. చౌమొహల్లా ప్యాలెస్‌ వరకు హెరిటేజ్‌ వాక్‌  హైదరాబాద్

    సాయి పల్లవి

    నాగచైతన్య కొత్త సినిమాలో హీరోయిన్ ఫిక్స్, వీడియో రిలీజ్ చేసిన మేకర్స్  నాగ చైతన్య
    అధికారిక ప్రకటన: నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ మరోసారి ఫిక్స్  నాగ చైతన్య

    తెలుగు సినిమా

    కళ్యాణ్ రామ్ డెవిల్: సిద్ శ్రీరామ్ పాడిన మాయే చేసే మెల్లగా పాట ప్రోమో రిలీజ్  కళ్యాణ్ రామ్
    Ganesh Chaturhi Songs: వినాయక చవితి సందర్భంగా టాప్ సాంగ్స్ లిస్టు ఇవే! వినాయక చవితి
    Extra Ordinary Man: నితిన్ కొత్త సినిమా నుండి రిలీజైన పోస్టర్ చూసారా?  ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్
    స్కంద: 'కల్ట్ మామా' పాటలో బాలీవుడ్ బ్యూటీతో చిందులేసిన రామ్ పోతినేని  స్కంద

    సినిమా

    'నేను కనిపించకపోతే అడిగేవారు'.. రజనీకాంత్ పై జైలర్ విలన్ ఆసక్తికర వ్యాఖ్యలు రజనీకాంత్
    యానిమల్: టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా  యానిమల్
    బాలయ్య భగవంత్ కేసరి విడుదల వాయిదాపై క్లారిటీ  బాలకృష్ణ
    రవితేజ మాస్ లుక్: వైరల్ అవుతున్న టైగర్ నాగేశ్వరరావు కొత్త పొస్టర్  రవితేజ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025