Saif stabbing incident: సైఫ్‌పై దాడి ఇంటి దొంగల పనే.. పోలీసుల అనుమానం..
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ఓ గుర్తుతెలియని దుండగుడు ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసి గాయపరచడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సైఫ్ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు.
కానీ, దాడి జరిగిన రెండు గంటల ముందు వరకు ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని రికార్డ్ చూపింది.
దీంతో, ఈ దాడి ఇంటి దొంగల పనిగా భావిస్తున్నారు. సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తి కెమెరాలకు చిక్కకుండా పారిపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి.
సైఫ్ నివసిస్తున్న సొసైటీలోకి కొత్త వ్యక్తుల ప్రవేశం లేదని, దుండగుడు అప్పటికే అక్కడ ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఇంట్లో పనిచేసేవారిలో ఒకరు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
వివరాలు
దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి
సైఫ్ అలీఖాన్ కుటుంబం ముంబై నగరంలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తోంది.
గురువారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు.
సైఫ్ కుమారుడు జేహ్ గదిలో దొంగతనానికి యత్నిస్తుండగా కేర్ టేకర్ గట్టిగా కేకలు వేసింది.
దాంతో సైఫ్ అక్కడ చేరుకున్నాడు, వారు ఇద్దరూ మధ్య ఘర్షణ జరిగింది.
తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా, దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేసి పారిపోయాడు.
సైఫ్‌ను తీవ్రంగా గాయపరిచిన ఆ దాడిలో ఆరు చోట్ల కత్తి గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించారు.
వివరాలు
సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళకు స్వల్ప గాయాలు
ఈ దాడిపై పోలీసులు వెంటనే సమాచారం అందుకుని దర్యాప్తు చేపట్టారు.
సీనియర్ పోలీసుల బృందం సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో, నిందితుడు గోడ దూకి ఇంటి ఆవరణలోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం సైఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ దాడిలో సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఆమె పరిస్థితి కూడా నిలకడగా ఉందని పేర్కొనబడింది.