
25 Years of Sakhi: మాధవన్‌కు బ్రేక్ ఇచ్చిన 'సఖి'.. 25 ఏళ్ల వెనుక ఉన్న కథ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
కొన్ని సినిమాలు కాలాన్ని దాటి మన మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. అలాంటి చిత్రాల్లో మణిరత్నం దర్శకత్వంలో 2000లో విడుదలైన 'సఖి' (Sakhi) ఒకటి. ఇప్పుడు ఈ సినిమాకు 25 సంవత్సరాలు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా ఈ ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..
కథ ఎలా పుట్టింది?
1990ల చివరిలో వరుస పరాజయాలతో (ఇద్దరు, దిల్ సే) నిరుత్సాహంలో ఉన్న మణిరత్నం, ఓ రోజు ప్రేమ జంట బైక్‌పై వెళ్లే సన్నివేశాన్ని గమనించి, "ప్రేమలో ఉండేంత వరకే అంతా బాగుంటుంది.
కానీ పెళ్లయ్యాకే అసలైన కథ మొదలవుతుందనే ఆలోచనలో పడ్డారు. ఈ ఐడియాను రచయిత సుజాత (కలంపేరు)తో పంచుకోగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Details
షారుక్‌ఖాన్, వసుంధరా దాస్.. అన్‌ఫినిష్డ్ స్టోరీ
స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత నటీనటుల ఎంపికే ప్రధాన సవాలుగా మారింది. అప్పట్లో పలువురు షారుక్ ఖాన్‌ని హీరోగా సూచించినా, పేరున్న వారితో కాకుండా కొత్తవారితో సినిమా చేయాలన్నది మణిరత్నం ఆశయం.
గతంలో'ఇద్దరు'సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం రిజెక్ట్ అయిన మాధవన్‌కి ఈసారి ఛాన్స్ దక్కింది.
వసుంధరా దాస్‌ను హీరోయిన్‌గా స్క్రీన్ టెస్ట్ చేసినా, ఆమె బదులుగా షాలినిని ఎంపిక చేశారు.ఆమె నటన మణిరత్నానికి బాగా నచ్చిందట.
విక్రమ్ ఎందుకు 'నో' చెప్పాడు?
హీరోయిన్ అక్క పెళ్లిచూపులు చూసేందుకు వచ్చే అతిథి పాత్ర కోసం విక్రమ్‌ను సంప్రదించగా, పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో ఆయన తిరస్కరించారు.
అతిథి పాత్రకు మొదట మమ్ముట్టి, మోహన్‌లాల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయన్న సమాచారం.
Details
పాటలు లేకుండా 'సఖి'?
సినిమాలో ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికీ అమరగీతాల్లా వినిపిస్తోంది. 'పచ్చందనమే', 'స్నేహితుడా' వంటి పాటలు విశేష ప్రజాదరణ పొందాయి.
కానీ, ఆశ్చర్యంగా భావించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ సినిమాను మొదట పాటలు లేకుండానే తెరకెక్కించాలని మణిరత్నం ఆలోచించారట! ఇదే విషయాన్ని మాధవన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇది సాఫ్ట్‌వేర్ బూమ్‌ను ప్రస్తావించిన తొలి సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
Details
అవార్డుల జల్లు
'సఖి' చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ పరిచయ నటుడు (మాధవన్), ఉత్తమ సంగీత దర్శకుడు (ఏఆర్ రెహమాన్), ఉత్తమ ఛాయాగ్రాహకుడు విభాగాల్లో అవార్డులు లభించాయి.
తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డుల్లో షాలినికి 'స్పెషల్ ప్రైజ్', స్వర్ణలతకు ఉత్తమ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు లభించాయి.
ఇప్పటికీ అభిమానుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన 'సఖి' సినిమా 25 ఏళ్ల తరువాత కూడా అదే ఉత్సాహంతో గుర్తు చేసుకునేలా చేస్తోంది.