సలార్ సినిమాకు అనుకోని దెబ్బ: పృథ్వీరాజ్ కు యాక్సిడెంట్
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమాలో మళయాలీ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నటుడు పృథ్వీరాజ్ కు యాక్సిడెంట్ అయ్యింది. విలయత్ బుద్ధ సినిమా షూటింగ్ లో ఆదివారం (జూన్ 25) రోజున ఈ యాక్సిడెంట్ జరిగింది. ఫైట్ సీక్వెన్స్ చేస్తుండగా యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే కోచిలోని ప్రైవేటు హాస్పిటల్ కి తీసుకువెళ్ళారట. పృథ్వీరాజ్ ను పరీక్శ్ఃఇంచిన వైద్యులు, కాలికి సర్జరీ చేయాల్సి ఉందని తెలియజేసారు. సర్జరీ తర్వాత కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందట.
జులై 7న సలార్ టీజర్
పృథ్వీరాజ్ కు యాక్సిడెంట్ అయ్యిందన్న వార్త సోషల్ మీడియాలోకి రాగానే అభిమానులు అందరూ, పృథ్వీరాజ్ తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ప్రభాస్ నటిస్తున్న సలార్ ఒకటి. సలార్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఆల్రెడీ శృతి హాసన్ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యిందని చిత్రబౄందం చెప్పుకొచ్చింది. మరి పృథ్వీరాజ్ భాగం కూడా చిత్రీకరణ పూర్తయ్యిందా లేదా అన్నది బయటకు రావాల్సి ఉంది. ఒకవేళ పృథ్వీరాజ్ భాగం పూర్తి కాకపోతే సలార్ సినిమాకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతున్న సలార్ సినిమా, సెప్టెంబర్ 28వ తేదీన విడుదల అవుతుంది. జులై 7న టీజర్ రిలీజ్ అవుతుందని వినిపిస్తోంది.