
'Salaar' day 2 collections: 'సలార్' 2వ రోజు కలెక్షన్లు ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది ఆరంభంలో 'ఆదిపురుష్'తో అభిమానులను నిరాశపరిచిన ప్రభాస్.. శుక్రవారం విడుదలైన 'సలార్: పార్ట్ 1-సీస్‌ఫైర్'తో ఆకట్టుకున్నాడు.
మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. కలెక్షన్లలో దూసుకుపోతోంది.
ఈ చిత్రం తొలి రోజు భారత్‌లో రూ.90.7కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.175కోట్లు వసూలు చేసింది.
2023లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
రెండో రోజు కూడా సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చూపించింది.
మొదటి రోజు కలెక్షన్ల కంటే కాస్త తగ్గినా.. భారీగానే వసూళ్లను రాబట్టింది.
రెండో రోజైన శనివారం రూ.56.35కోట్లు వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 147.05 కోట్లను రాబట్టింది.
తొలిరోజు వసూళ్లతో పోలిస్తే రెండోరోజు 37.87% తగ్గింది.
సలార్
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ఆక్యుపెన్సీ
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజుతో పోలిస్తే.. రెండో రోజు ఆక్యుపెన్సీ తగ్గినట్లు కనిపిస్తోంది.
రెండో రోజు ఆక్యుపెన్సీ తగ్గడానికి టికెట్ల రేట్లు పెరగడమే కారణంగా తెలుస్తోంది.
సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, టిన్ను ఆనంద్, బాబీ సింహా, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు.
షారూక్ ఖాన్ జవాన్, పఠాన్, విజయ్ మూవీ లియో, రజనీకాంత్ జైలర్ చిత్రాలను అధిగమించి ఈ ఏడాది భారీ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలిచింది.
ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి 2898 AD'లో నటిస్తున్నారు. ప్రభాస్ కెరీర్‌లోనే ఈమూవీ భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనుంది.
ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్'.. సాలార్: పార్ట్ 2లో నటించనున్నాడు.