Salar : మరో రెండు రోజుల్లో సలార్ విడుదల.. రేపు సెకండ్ సాంగ్ రిలీజ్
పాన్ ఇండియా స్థాయిలో ప్రస్తుతం 'సలార్' సినిమా మేనియా కనిపిస్తోంది. సోమవారం ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దీనికి ప్రేక్షకులు, ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. యాక్షన్ సీక్వెన్సులతో టాకీసుల్లో ప్రేక్షకులకు పూనకాలే అన్న రేంజ్‍లో ట్రైలర్ సాగింది. ఇప్పటికే రెండు ట్రైలర్లు, ఓ పాటను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో సాంగ్ విడుదలకు సిద్ధమైంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ, డిసెంబర్ 22న థియేటర్లలో రిలీజ్ కానుంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్'పై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరిలోనూ అంచనాలు మిన్నంటుతున్నాయి.
సలార్ నుంచి రేపు మరో సాంగ్ రిలీజ్
శృతి హాసన్ హీరోయిన్'గా నటిస్తుండగా కీలక పాత్రల్లో జగపతిబాబు, బాబీ సింహా, రామచంద్రరాజు, ఈశ్వరరావు, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని హోంబలె ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్, థియేట్రికల్ ట్రైలర్, రిలీజ్ ట్రైలర్, ఫస్ట్ సాంగ్ ఇలా అన్ని ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 22న సినిమా రిలీజ్ ముంగిట సలార్ నుంచి సెకండ్ సాంగ్ రేపు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఐటెం సాంగ్'గా తెలుస్తోంది.