Page Loader
SalmanKhan: సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి దృశ్యాలు విడుదల .. సీసీటీవీ ఫుటేజీ వైరల్ 
సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి దృశ్యాలు విడుదల .. సీసీటీవీ ఫుటేజీ వైరల్

SalmanKhan: సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి దృశ్యాలు విడుదల .. సీసీటీవీ ఫుటేజీ వైరల్ 

వ్రాసిన వారు Stalin
Apr 14, 2024
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఈరోజు ఉదయం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ వార్త బయటకు రావడంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది. సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన ఈ ప్రమాదం కూడా అతని పాత బెదిరింపులతో ముడిపడి ఉంది. గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. అందులో ఒక బుల్లెట్ సల్మాన్ ఖాన్ ఇంటి బాల్కనీ గోడపై కూడా దూసుకుపోయింది. ముంబై క్రైం బ్రాంచ్‌తో పాటు బాంద్రా పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అనేక అంశలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Dtails

హెల్మెట్ ధరించిన దుండగులు 

కాగా, ఈ రోజు జరిగిన సంఘటనకు సంబంధించిన ఒక సిసిటివి ఫుటేజ్ బయటపడింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో బైక్ నడుపుతున్నవ్యక్తులు ముఖాన్ని దాచుకుని హెల్మెట్ కూడా ధరించడం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వారిద్దరినీ గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది.ప్రమాదం తర్వాత సల్మాన్‌ఖాన్‌ ఇంటికి పోలీసులు భద్రతను పెంచారు. సల్మాన్‌కి ఇప్పటికే భద్రత కల్పించారు.ఎక్కడికెళ్లినా సెక్యూరిటీ కిందే వెళ్తాడు. ఈ కాల్పులు జరిగినప్పుడు, సల్మాన్ ఖాన్ తన ఇంటిలో ఉన్నాడు. ఇది కాకుండా, రెండు రోజుల క్రితం సల్మాన్ నిలబడి అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రదేశాన్ని బైక్‌పై దాడి చేసిన వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది.

Details

సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన లారెన్స్ బిష్ణోయ్

గత కొన్నేళ్లుగా సల్మాన్‌పై బెదిరింపుల ప్రక్రియ కొనసాగుతోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కూడా సల్మాన్ ఖాన్‌ను బెదిరించాడు. ఆ తర్వాత ఆయనకు భద్రతను పెంచారు. చాలా కాలంగా లారెన్స్ టార్గెట్‌లో సల్మాన్ ఉన్నాడు. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు . ఈ ప్రమాదం తర్వాత సల్మాన్ ఖాన్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజీ