NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Samantha: యాక్షన్ సీక్వెన్స్‌లో చెలరేగిన సమంత.. కొత్త వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల 
    తదుపరి వార్తా కథనం
    Samantha: యాక్షన్ సీక్వెన్స్‌లో చెలరేగిన సమంత.. కొత్త వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల 
    యాక్షన్ సీక్వెన్స్‌లో చెలరేగిన సమంత.. కొత్త వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల

    Samantha: యాక్షన్ సీక్వెన్స్‌లో చెలరేగిన సమంత.. కొత్త వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 29, 2024
    11:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓటీటీలోకి మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. ఈ సిరీస్ పేరు సిటడెల్ హనీ బన్నీ. సిటడెల్ స్పై యూనివర్స్ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న ఇండియన్ వెర్షన్ సిరీస్ ఇది.

    సమంత, వరుణ్ ధావన్ కలిసి నటించారు. అయితే తాజాగా మరో ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

    సిటడెల్.. ఇదొక స్పై యూనివర్స్. గతంలో ఇంగ్లిష్‌లో వచ్చిన తొలి సీజన్‌లో ప్రియాంకా చోప్రా.. నాదియా సింగ్ అనే ఓ స్పైగా నటించారు.

    ఇప్పుడు దీనికి ప్రీక్వెల్ హిందీలో రాబోతోంది. అసలు వాళ్లు ఏజెంట్లుగా ఎలా మారారు? ఆ ఇద్దరూ గూఢాచారులుగా చేసిన ఆపరేషన్స్ ఏంటి అన్నది సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో చూడొచ్చు.

    Details

    హనీ పాత్రలో సమంత

    ఇందులో హనీగా సమంత, బన్నీగా వరుణ్ ధావన్ కనిపించారు. తాజాగా ఈ సిరీస్ రెండో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు.

    ఇది మరింత యాక్షన్ తో ఈ జానర్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా సాగింది. ముఖ్యంగా సమంతను హైలైట్ చేస్తూ ఈ కొత్త ట్రైలర్ సాగడం విశేషం.

    తాము చేస్తున్నది తప్పని తెలిసినా.. చేయక తప్పదంటూ బన్నీ పాత్ర పోషించిన వరుణ్ ధావన్ ఎంట్రీతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత తన కూతురిని కాపాడుకోవడానికి ప్రయత్నించే సమంత పాత్ర వస్తుంది.

    ఓ నటి కావాల్సిన వ్యక్తి.. స్పైగా ఎలా మారిందన్నది కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. చాలా వరకు సమంత చుట్టే ఈ ట్రైలర్ తిరిగింది.

    Details

    నవంబర్ 7  స్ట్రీమింగ్

    ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ లో తన స్టంట్స్‌తో సామ్ అదరగొట్టింది.

    ఇంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించిన సమంత నటించిన విషయం తెలిసిందే. యాక్షన్ లవర్స్ కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ఎంజాయ్ చేస్తారని ట్రైలర్ చూస్తూనే స్పష్టమవుతోంది.

    చాలా రోజుల గ్యాప్ తర్వాత సమంత ఈ సిరీస్ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సమంత
    అమెజాన్ ప్రైమ్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    సమంత

    ఖుషి సెకండ్ సింగిల్ ప్రోమో: సిద్ శ్రీరామ్ గొంతులోంచి వస్తున్న పాట రిలీజ్ ఎప్పుడంటే?  విజయ్ దేవరకొండ
    ఖుషి సెకండ్ సాంగ్ విడుదల: సమంత, విజయ్ కెమిస్ట్రీ అదుర్స్  విజయ్ దేవరకొండ
    లాంగ్ బ్రేక్ కోసం సిద్ధమైపోయిన సమంత: ఈరోజు స్పెషల్ అంటూ పోస్ట్  తెలుగు సినిమా
    ఖుషి షూటింగ్ పూర్తి; చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ విజయ్ దేవరకొండ

    అమెజాన్ ప్రైమ్

    అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ రికార్డ్: సెకనుకు ఐదు స్మార్ట్ ఫోన్లు అమ్మిన అమెజాన్  అమెజాన్‌
    ఓటీటీలోకి వచ్చేసిన స్పై: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే? స్పై
    అమెజాన్ ప్రైమ్: సుడల్ 2 సీజన్ పై క్లారిటీ; బలమైన కథను చెప్పేందుకు రెడీ  ఓటిటి
    Nagachaitanya Dhootha : ఓటీటీలోకి నాగ‌చైత‌న్య ధూత వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ తెలుసా టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025