LOADING...
Maa Inti Bangaaram: నందిని రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ మోడ్‌లో సమంత.. 'మా ఇంటి బంగారం' టీజర్‌ రిలీజ్

Maa Inti Bangaaram: నందిని రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ మోడ్‌లో సమంత.. 'మా ఇంటి బంగారం' టీజర్‌ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2026
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

'చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరిలో కలిసిపోతుంది..' అంటూ పూర్తి యాక్షన్‌ మోడ్‌లో సమంత (Samantha) అదరగొడుతోంది. ఆమె ప్రధాన పాత్రలో, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram). ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌లో సమంత మొదట అమాయకంగా, సాధారణ యువతిగా కనిపిస్తూనే, క్రమంగా కథ ముందుకు సాగేకొద్దీ యాక్షన్‌ సన్నివేశాల్లో దూకుడైన అవతారంలోకి మారడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తనదైన స్టైల్‌లో యాక్షన్‌ చేస్తూ, ఎమోషన్‌తో పాటు ఇంటెన్స్‌ సీన్స్‌లోనూ సమంత బలమైన ప్రభావం చూపింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Advertisement