
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రియా చక్రవర్తి కష్టాలు: హీరో అంటూ పొగిడిన సమంత
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం అందరినీ బాధ పెట్టింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అంటూ అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి రియా చక్రవర్తి బయట పెట్టింది.
సుశాంత్ ఆత్మహత్య తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉన్న రియా చక్రవర్తి, ముంబైలో ఒకానొక ప్రైవేట్ ఈవెంట్లో ఈ విషయాలను చెప్పుకొచ్చింది.
సుశాంత్ సింగ్ కేసు సమయంలో తన స్నేహితులు, కుటుంబం తనకు సపోర్టుగా నిలిచారని రియా చక్రవర్తి అన్నారు.
Details
హీరో అంటూ పొగిడిన సమంత
తన నాన్నగారు ఆర్మీలో ఉన్నందున ఆర్మీ పెంపకంలో పెరిగానని, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా చివరి వరకు పోరాడాలని నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారని, తాను అదే చేశానని రియా చక్రవర్తి చెప్పుకొచ్చింది.
అమ్మా నాన్న మాత్రమే కాకుండా తన సోదరుడు ఇంకా స్నేహితులు ఎంతో సపోర్ట్ చేశారని, ఏదైనా కష్టం వచ్చినప్పుడు నమ్మి సపోర్ట్ చేసే వాళ్ళు ముగ్గురు లేదా నలుగురు మనుషులు మాత్రమే ఉంటారని రియా చక్రవర్తి మాట్లాడింది.
ఆమె మాటలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. అయితే ఆ వీడియో క్లిప్ ని సమంత షేర్ చేస్తూ హీరో అనే క్యాప్షన్ ని పెట్టింది. సమంతకు రిప్లై ఇచ్చిన రియా, రైట్ బ్యాక్ ఎట్ యు అని రాసుకొచ్చింది.