LOADING...
Maa Inti Bangaram: సమంత అభిమానులకు శుభవార్త.. 'మా ఇంటి బంగారం' టీజర్ డేట్ ఫిక్స్!
సమంత అభిమానులకు శుభవార్త.. 'మా ఇంటి బంగారం' టీజర్ డేట్ ఫిక్స్!

Maa Inti Bangaram: సమంత అభిమానులకు శుభవార్త.. 'మా ఇంటి బంగారం' టీజర్ డేట్ ఫిక్స్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 07, 2026
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

సమంత అభిమానులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'మా ఇంటి బంగారం'. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ విషయంలో ఇప్పటివరకూ దర్శకురాలు తప్ప మరెవ్వరూ స్పందించలేదు. తాజాగా ఈ మూవీపై కీలక సమాచారాన్ని సమంత స్వయంగా వెల్లడించారు. రాబోయే సంక్రాంతి పండుగకు టీజర్ విడుదల చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమంత, ''చూస్తూనే ఉండండి... మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది'' అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ జత చేశారు. జనవరి 9న టీజర్ విడుదల కాబోతుందని స్పష్టం చేశారు. ఈ అప్‌డేట్‌తో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కామెంట్ సెక్షన్‌లో 'క్వీన్ ఈజ్ బ్యాక్' అంటూ హంగామా చేస్తున్నారు.

వివరాలు 

క్రైమ్ థ్రిల్లర్ కథతో..

'ఓ బేబీ' తర్వాత సమంత-దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇదే. గతేడాది అక్టోబర్ 2న షూటింగ్ ప్రారంభం కాగా, సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఆమె ప్రొడక్షన్‌లో రూపొందుతున్న రెండో సినిమా కావడం విశేషం. దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 1980ల కాలం నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో సమంతతో పాటు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో కనిపించనున్నారు.

వివరాలు 

'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు

ఇదే సమయంలో సమంత మరో భారీ ప్రాజెక్ట్‌లో కూడా బిజీగా ఉన్నారు. 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' అనే వెబ్ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పైనా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement