Page Loader
Prabhas Spirit : 'స్పిరిట్' మూవీపై సందీప్ రెడ్డి వంగా బిగ్ అనౌన్స్‌మెంట్
'స్పిరిట్' మూవీపై సందీప్ రెడ్డి వంగా బిగ్ అనౌన్స్‌మెంట్

Prabhas Spirit : 'స్పిరిట్' మూవీపై సందీప్ రెడ్డి వంగా బిగ్ అనౌన్స్‌మెంట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2025
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న చిత్రం 'స్పిరిట్‌' (Spirit). దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు అప్‌డేట్స్ వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్.

Details

మెక్సికోలో షూటింగ్

ఇదిలావుంటే, తాజాగా 'స్పిరిట్‌' సినిమా షూటింగ్‌కు సంబంధించి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఓ కీలక అప్‌డేట్‌ను పంచుకున్నాడు. ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన, ఈ సినిమా షూటింగ్‌ను మెక్సికోలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించాడు. అంతేకాకుండా ఇంతకంటే పెద్ద అప్‌డేట్ ఏమి ఇవ్వలేనని హింట్ ఇచ్చాడు. ఈ చిత్రంలో ప్రభాస్ మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. అర్జున్ రెడ్డి, యానిమల్ తరహాలోనే 'స్పిరిట్‌'లో కూడా సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌ను కొత్తగా ప్రెజెంట్ చేయనున్నాడు. వచ్చే నెలలో సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుందని, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, ఆరు నెలల్లో పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోందని తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కీలక ప్రకటన సందీప్ రెడ్డి వంగా