Sritej Health Bulletin: సంధ్య థియేటర్ ఘటన.. కోలుకుంటున్న శ్రేతేజ్
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం 9 సంవత్సరాల చిన్నారి శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి శ్రీతేజ్ గత 14 రోజులుగా ప్రాణాలతో పోరాటం చేస్తూ, ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. తాజాగా వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్లు తెలిపారు.
శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి
శరీర భాగాలు కదిలిస్తూ, శ్రీతేజ్ కళ్ళు తెరిచాడని పేర్కొన్నారు. బాలునికి ఆహారం ట్యూబ్ ద్వారా అందిస్తున్నామన్నారు. చికిత్సపై స్పందిస్తున్న శ్రీతేజ్ త్వరలో కోలుకోవాలని వైద్యులు ఆశిస్తున్నారు. దీనికి ఇంకా కొంత సమయం పడవచ్చని వైద్యులు పేర్కొన్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని రోజుకు రోజుకు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.