Loading...
Sanju Samson: రజనీ సినిమా కోసం సంజు స్పెషల్‌ ప్లాన్‌.. ఏకంగా థియేటర్‌ అంతా బుక్‌!
రజనీ సినిమా కోసం సంజు స్పెషల్‌ ప్లాన్‌.. ఏకంగా థియేటర్‌ అంతా బుక్‌!

Sanju Samson: రజనీ సినిమా కోసం సంజు స్పెషల్‌ ప్లాన్‌.. ఏకంగా థియేటర్‌ అంతా బుక్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 20, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ఓపెనర్‌ సంజు శాంసన్‌ (Sanju Samson) తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth)కు వీరాభిమాని. తన అభిమాన నటుడిపై ఉన్న ప్రేమను సంజు మరోసారి చాటుకున్నాడు. తాజాగా రజనీకాంత్‌ నటించిన 'జైలర్‌ 2' (Jailer 2) సినిమాను చూసేందుకు ఏకంగా థియేటర్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సంజు శాంసనే వెల్లడించాడు. సినిమా విడుదలైన రోజే చూడాలనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదని తెలిపాడు. 'నాకు రజనీ సర్‌ సినిమాలు చూడటం చాలా ఇష్టం. ఆయన తర్వాత ఏ సినిమా చేయబోతున్నారో తెలుసుకోవాలని ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను. ఈసారి 'జైలర్‌ 2' సినిమా చూడటానికి ఒక రోజు ఆలస్యమైంది.

వివరాలు

చాలా ఆనందంగా ఉంది

రజనీ సర్‌ సినిమాలను వీలైనంత వరకు విడుదలైన మొదటి రోజే చూసేందుకు ప్రయత్నిస్తాను.

అయితే, నిన్న దిల్లీలో ఓ కార్యక్రమం ఉండటంతో సినిమాను చూడలేకపోయాను. కానీ, అదృష్టవశాత్తూ థియేటర్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకుని నా భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూసే అవకాశం లభించింది.

బిగ్‌స్క్రీన్‌పై రజనీ సర్‌ను చూసి ఎంతో సంతోషించాను. మా జట్టులో తమిళం తెలిసిన సపోర్టింగ్‌ స్టాఫ్‌ సభ్యులు కూడా సినిమాను చూసేందుకు వచ్చారని సంజు తన ఆనందాన్ని పంచుకున్నాడు.

తన అభిమాన నటుడి సినిమాను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రత్యేకంగా థియేటర్‌ మొత్తాన్ని బుక్‌ చేసుకుని వీక్షించిన సంజు శాంసన్‌.. రజనీకాంత్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు.

ADVERTISEMENT