LOADING...
Sarvam Maya : 'సర్వం మాయ' బ్లాక్‌బస్టర్.. 10 రోజుల్లో రూ. 100 కోట్ల 
'సర్వం మాయ' బ్లాక్‌బస్టర్.. 10 రోజుల్లో రూ. 100 కోట్ల

Sarvam Maya : 'సర్వం మాయ' బ్లాక్‌బస్టర్.. 10 రోజుల్లో రూ. 100 కోట్ల 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2026
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

2015లో విడుదలైన ప్రేమమ్ మలయాళ సినీ పరిశ్రమను ఊపేసిన సినిమాగా నిలిచింది. మలయాళ హీరో నివిన్ పౌలీ కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పిన చిత్రమిదే. అలాగే ఈ సినిమాతోనే ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్‌లకు జీవితాన్ని మార్చే బ్రేక్ వచ్చింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రేమమ్‌ అప్పట్లో ఏకంగా రూ.75 కోట్ల వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు కొత్త నిర్వచనం ఇచ్చిన ఈ చిత్రం, మలయాళ సినిమాల్లో ఒక ట్రెండ్‌గా నిలిచింది. ప్రేమమ్ తర్వాత నివిన్ పౌలీ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ, ఆ స్థాయి సక్సెస్ మాత్రం దక్కలేదు.

Details

బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు

అయితే దాదాపు పదేళ్ల తర్వాత సర్వం మాయతో మళ్లీ నివిన్ పౌలీ సాలిడ్ హిట్‌ను అందుకున్నాడు. డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. వృషభ లాంటి భారీ సినిమాను తట్టుకుని మరీ రికార్డులు సృష్టిస్తున్న సర్వం మాయ, విడుదలైన కేవలం 10 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను అందుకుని ప్రేమమ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ ఫాంటసీ మూవీకి మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో నివిన్ పౌలీ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా సర్వం మాయ నిలిచింది.

Details

 ప్రీతి ముకుందన్‌కు సూపర్ సక్సెస్ 

ఈ సినిమాతోనే మైనే ప్యార్ కియా ద్వారా మాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కని ప్రీతి ముకుందన్‌కు గట్టి సక్సెస్ లభించింది. అలాగే ఇందులో మెయిన్ లీడ్‌గా నటించిన రియా షిబు ఖాతాలోనూ ఓ హిట్ చేరింది. ప్రేమమ్ తర్వాత కొంతకాలం ట్రాక్ తప్పిన నివిన్ పౌలీ, సర్వం మాయతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇటీవల నివిన్ పౌలీ విభిన్నమైన పాత్రల వైపు అడుగులు వేస్తూ, విలన్ రోల్స్‌కూ షిఫ్ట్ అయ్యాడు. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న బెంజ్ సినిమాలో, లారెన్స్ రాఘవన్‌కు ప్రత్యర్థిగా నిలవనున్నాడు.

Advertisement

Details

సెట్స్‌పై డియర్ స్టూడెంట్స్, బేబీ గర్ల్ సినిమాలు

ఈ చిత్రంలో వాల్టర్ అనే వైలెంట్ విలన్ పాత్రలో నివిన్ కనిపించనున్నాడు. అంతేకాదు నయనతారతో జోడీగా నటిస్తున్న డియర్ స్టూడెంట్స్, బేబీ గర్ల్ సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఎజు కాదల్, ఎజు మలై చిత్రాలు కూడా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం మీద సర్వం మాయ సక్సెస్‌తో నివిన్ పౌలీ కెరీర్ మళ్లీ గట్టి ఊపందుకుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement