
Sathyabhama: సత్యభామ నుండి మొదటి సింగిల్ వచ్చేసింది.. కళ్లారా చూశాలే
ఈ వార్తాకథనం ఏంటి
కాజల్ అగర్వాల్ నటిస్తున్న కాప్ క్రైమ్ థ్రిల్లర్ 'సత్యభామ' వెండితెరపైకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది.
ఈ చిత్రం మే 17న థియేటర్లలోకి రానుందని చిత్ర నిర్మాతలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ని ACP సత్యభామగా కనిపించనుంది. ఈక్రమంలోనే తాజాగా మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసారు.
ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. 'కళ్లారా చూశాలే' అంటూ సాగే రొమాంటిక్ లవ్ మెలోడీ సాంగ్ ని నేడు రిలీజ్ చేసారు.
Details
కాజల్ అండ్ నవీన్ చంద్ర మధ్య వచ్చే లవ్ సీన్స్ సూపర్
శ్రీచరణ్ పాకాల స్వరపరచిన ఈ పాట మెలోడియస్ లవ్ ట్రాక్ అని తెలుస్తోంది. ఇక ఈ పాటకి రాంబాబు గోశాల లిరిక్స్ అందించగా శ్రేయా ఘోషల్ పాడారు.
ఈ సినిమాలో నవీన్ చంద్ర మేల్ లీడ్ చేస్తున్నారు. ఇక ఈ పాటలో కాజల్ అండ్ నవీన్ చంద్ర మధ్య వచ్చే లవ్ సీన్స్ చూపించారు.
పాట అయితే వినడానికి, చూడడానికి చాలా బాగుంది.
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాల డైరెక్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాజల్ అగర్వాల్ చేసిన ట్వీట్
Our ever favourite @sheyaghoshal for my favourite #Kallara 💖
— Kajal Aggarwal (@MsKajalAggarwal) April 25, 2024
🎶 https://t.co/M8wH7l25yK#Satyabhama in theatres worldwide on May 17th.@Naveenc212 @AurumArtsoffl @sumanchikkala @sashitikka @SriCharanpakala @bobytikka @kalyankodati @KumarTV5Cinema @RekhaBoggarapu… pic.twitter.com/C0mMBtRYES