Jailer 2: 'జైలర్-2' సెట్స్ నుంచి సన్నివేశాలు లీక్.. సినీ పరిశ్రమలో కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
కొన్ని రోజుల క్రితం 'జన నాయగన్' పూర్తి నిడివి సినిమా ఆన్‌లైన్‌లో లీకైన ఘటన ఇంకా చర్చనీయాంశంగానే ఉండగా, ఇప్పుడు 'జైలర్ 2' చిత్రానికి సంబంధించిన సన్నివేశాలు కూడా సోషల్ మీడియాలో బయటకు రావడం సినీ పరిశ్రమను మరోసారి కలవరపరిచింది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జైలర్-2' సినిమా సెట్లో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో లీకయ్యాయి.
వివరాలు
అప్రమత్తమైన చిత్ర బృందం
ఈ వీడియోలు వేగంగా వైరల్ కావడంతో చిత్ర బృందం అప్రమత్తమైంది. ఈ వీడియోలను షేర్ చేసి ప్రచారం చేసిన సోషల్ మీడియా ఖాతాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సన్ పిక్చర్స్ ప్రకటించింది. అలాగే లీకైన సన్నివేశాల వీడియోలను ఆయా ఖాతాల నుంచి తొలగించేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలిపింది. ఇక ఈ ఘటనపై తమ యాంటీ పైరసీ బృందం నిశితంగా నిఘా ఉంచిందని, పరిస్థితిని సమీక్షిస్తూ తగిన చర్యలు కొనసాగిస్తున్నామని నిర్మాణ సంస్థ వెల్లడించింది.