Toxic: 'టాక్సిక్' రెండో పాట విడుదల.. యశ్-తారా సుతారియా రొమాన్స్‌తో సోషల్ మీడియా షేక్!
ఈ వార్తాకథనం ఏంటి
రాకింగ్ స్టార్ 'యశ్' హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి చిత్రబృందం తాజాగా రెండో పాట 'మనసు ఆగదే'ను విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన తొలి పాట 'తబాహి'లో బోల్డ్ రొమాంటిక్ టోన్‌ను చూపించిన మేకర్స్.. ఇప్పుడు రెండో పాటలో అంతకుమించిన రొమాన్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ పాటలో యశ్, బాలీవుడ్ నటి తారా సుతారియా మధ్య కనిపించిన కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాత్‌టబ్‌లో తారా సుతారియా ఎంట్రీ, ఆమెకు యశ్ గన్‌తో ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడిగే సన్నివేశం, వర్షంలో ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్ మూమెంట్స్, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వివరాలు
సినిమాపై భారీ అంచనాలు
పాట విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మంచి స్పందన అందుకుంటోంది.
యశ్, తారా సుతారియా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమాలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి విశాల్ మిశ్రా, కనిష్క్ బాగ్చీ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
రెండో పాట విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. యాక్షన్, రొమాన్స్, స్టైలిష్ విజువల్స్ కలయికగా రూపొందుతున్న 'టాక్సిక్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.