Loading...
Sowcar janaki: ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

Sowcar janaki: ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

వ్రాసిన వారు Moogati Shabari
Aug 21, 2026
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సీనియర్‌ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె శ్వాసకోశ సమస్యలతో పాటు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.

వివరాలు

ఆ సినిమా వల్లే ఆమెకు గుర్తింపు..

షావుకారు జానకి అసలు పేరు జానకి. ప్రముఖ నటి కృష్ణకుమారికి ఆమె చెల్లెలు.

1931 డిసెంబర్‌ 12న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో జన్మించారు.

చిన్నతనంలోనే నాటకాల్లో పలు పాత్రలు పోషిస్తూ నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు.

11 ఏళ్ల వయసులోనే రేడియోలో ఓ తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. 1949లో 'రక్షా రేఖ' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు.

ఆ తర్వాత 1950లో వచ్చిన 'షావుకారు' సినిమా విజయవంతం కావడంతో ఆమెకు 'షావుకారు జానకి'గా గుర్తింపు వచ్చింది.

వివరాలుు

400 సినిమాల్లో నటించిన జానకి..

ఆ తర్వాత జానకి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 సినిమాల్లో నటించారు.

అలాగే మూడు హిందీ సినిమాలు, ఓ మలయాళ చిత్రంలోనూ నటించారు.

సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

'వద్దంటే డబ్బు', 'కన్యాశుల్కం', 'పిచ్చి పుల్లయ్య', 'రేచుక్క-పగటిచుక్క', 'రోజులు మారాయి', 'సొంతవూరు', 'జయం మనదే', 'డాక్టర్ చక్రవర్తి', 'సంసారం ఒక చదరంగం', 'తోడికోడళ్లు', 'బాబు బంగారం', 'గీతాంజలి' తదితర చిత్రాల్లో షావుకారు జానకి కీలక పాత్రలు పోషించారు.

ఆమె చివరిసారిగా 'అన్నీ మంచి శకునములే' సినిమాలో కనిపించారు.

ADVERTISEMENT