
OG : బెజవాడలో సెన్సేషన్.. ప్రీమియర్స్‌తోనే ఆల్‌టైమ్ రికార్డు చేసిన 'ఓజీ'
ఈ వార్తాకథనం ఏంటి
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ ఎంటర్టైనర్ 'ఓజీ' విడుదలకు సిద్ధమైంది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిDVVఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఎంతటి స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనకాపల్లి నుండి అమెరికా వరకు ఎక్కడ చూసినా 'ఓజీ' హైప్ నడుస్తోంది. ఈ రోజు రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ప్రీమియర్ షోల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా సినిమాలకు కీలకమైన విజయవాడలో 'OG' కేవలం ప్రీమియర్ షోలతోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. విజయవాడలోని మొత్తం 8 సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
Details
అత్యధిక ప్రీమియర్ వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు
ఈ 8 థియేటర్లలో ప్రీమియర్ షోలు వేయగా, మొత్తం 4,286 టికెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. దీంతో ఒక్క ప్రీమియర్ షోల ద్వారానే రూ. 42,64,570/- గ్రాస్ వసూలైంది. విజయవాడ చరిత్రలోనే ఇది అత్యధిక ప్రీమియర్ వసూళ్లుగా నమోదైంది. అదే సమయంలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలను కలిపి మొత్తం 64 ప్రీమియర్ షోలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా కేవలం ప్రీమియర్‌ల ద్వారానే రూ. 1.60 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రీమియర్లకే ఈ స్థాయి కలెక్షన్లు రావడం 'ఓజీ' క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఈ లెక్కన మొదటి రోజు వసూళ్లు భారీ స్థాయిలో ఉండబోతున్నాయని, గత చిత్రాల రికార్డులు దాటేసే అవకాశముందని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది.