Page Loader
The Raja Saab: ది రాజా సాబ్‌తో సంచలనం.. ఇండియాలో ఎవరకి అందని రికార్డు అందుకోనున్న ప్రభాస్!
ది రాజా సాబ్‌తో సంచలనం.. ఇండియాలో ఎవరకి అందని రికార్డు అందుకోనున్న ప్రభాస్!

The Raja Saab: ది రాజా సాబ్‌తో సంచలనం.. ఇండియాలో ఎవరకి అందని రికార్డు అందుకోనున్న ప్రభాస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో సెన్సేషన్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ సిద్ధమయ్యాడు. ఆయన తాజా చిత్రం ది రాజా సాబ్ టీజర్ రిలీజ్‌ అయిన వెంటనే, ఈ సినిమా మీద క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. ఇప్పటివరకు ఇండియాలో ఏ హీరోకీ సాధ్యం కాని రికార్డును ఈ సినిమా ద్వారా ప్రభాస్ అధిగమించబోతున్నాడన్నది ఫిల్మ్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.

Details

 'ది రాజా సాబ్'తో మైల్‌స్టోన్ దిశగా ప్రభాస్

డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోన్న ఈమూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌ గత సినిమాల ట్రాక్ రికార్డు చూస్తే, ఇది కూడా భారీ ఓపెనింగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. వరుసగా నాలుగోసారి రూ.50 కోట్ల క్లబ్‌లో? ప్రభాస్ గత మూడు చిత్రాలు — ఆదిపురుష్(₹89 కోట్లు), సలార్(₹92 కోట్లు), కల్కి 2898ఎ.డి.(₹93 కోట్లు) తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.50 కోట్లు నెట్ కలెక్షన్ సాధించాయి. ఇప్పుడు ది రాజా సాబ్ కూడా అదే స్థాయిలో ఆరంభం తీసుకుంటే, వరుసగా నాలుగు సినిమాలకి తొలి రోజు రూ.50 కోట్లు నెట్ వసూళ్లు సాధించిన ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ నిలిచే అవకాశముంది. ఇప్పటివరకు ఈఫీట్‌ను ఎవరూ అందుకోలేకపోయారు.

Details

హారర్ కామెడీతో మళ్లీ పాత ప్రభాస్ స్టైల్

ఈ సినిమాలో ప్రభాస్ తన సిగ్నేచర్ మాస్ స్టైల్‌ను మరోసారి కనబరుస్తున్నాడన్న మాట వినిపిస్తోంది. ప్రత్యేకంగా హారర్ కామెడీ జానర్‌లో తొలిసారి ప్రయత్నిస్తున్నాడు. ఈ యాంగిల్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Details

ఫస్ట్ డే వసూళ్లే కాదు, టాక్‌పై డిపెండ్

తొలి రోజు వసూళ్లపరంగా ప్రభాస్ తిరుగులేని రికార్డులు సృష్టించనట్టు కనిపిస్తోంది. కానీ దీని తర్వాత వసూళ్లు ఎలా ఉంటాయన్నది, సినిమా టాక్‌పై ఆధారపడి ఉంటుంది. కానీ ఓపెనింగ్స్ పరంగా చూస్తే మాత్రం, ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిని ప్రభాస్ ది రాజా సాబ్ ద్వారా చేరుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ సినిమాతో ప్రభాస్‌ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే నంబర్ వన్ హీరోగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమానులే కాదు, సినీ వర్గాలూ ఈ చిత్రంపై భారీగా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మిగతా హీరోలంతా ఆ రికార్డును అందుకునేలోగా ప్రభాస్ మరోసారి తన మార్క్‌ను నెలకొల్పనున్నాడు.