Loading...
The Paradise : 'ది ప్యారడైజ్'కు షాక్.. ఆదివారం భారీగా పడిపోయిన కలెక్షన్స్
'ది ప్యారడైజ్'కు షాక్.. ఆదివారం భారీగా పడిపోయిన కలెక్షన్స్

The Paradise : 'ది ప్యారడైజ్'కు షాక్.. ఆదివారం భారీగా పడిపోయిన కలెక్షన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2026
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భారీ యాక్షన్ చిత్రం 'ది ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి ఆట నుంచే సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజున మాత్రం భారీ వసూళ్లు నమోదయ్యాయి. ఆ తర్వాత రెండో రోజు నుంచి కలెక్షన్లలో గణనీయమైన తగ్గుదల కనిపించగా.. ప్రస్తుతం ఓ మోస్తరు వసూళ్లతోనే సినిమా కొనసాగుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ 'ది ప్యారడైజ్'కు పెద్దగా కలిసిరాలేదు. ప్రీమియర్స్‌తో పాటు ఓపెనింగ్ డేలో మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రెండో రోజు నుంచి ఒక్కసారిగా డౌన్ అయింది.

వివరాలు

కలెక్షన్లపై తీవ్ర ప్రభావం

ముఖ్యంగా నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో తొలి ఆదివారం కలెక్షన్లు మరింత తగ్గినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఉత్తర అమెరికా వ్యాప్తంగా 263 లొకేషన్లలో ప్రదర్శితమవుతున్న 'ది ప్యారడైజ్'.. నాలుగో రోజు ఆదివారం ఉదయం 10 గంటల సమయానికి కేవలం 32 వేల డాలర్లను మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది.

తొలి రోజుల్లో నమోదైన వసూళ్లతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం.

నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్లలో భారీ పతనం చోటుచేసుకున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

వీకెండ్ ప్రారంభంలో వసూళ్ల పరంగా కొంత జోరు కనిపించినప్పటికీ.. సినిమాకు వచ్చిన మిక్స్‌డ్ రెస్పాన్స్ ప్రభావం ఆదివారం కలెక్షన్లపై పడినట్లు తెలుస్తోంది.

వివరాలు

2.85 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మాస్ యాక్షన్ సినిమాకు దూరంగా ఉంటున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక ఓవర్సీస్‌లో 'ది ప్యారడైజ్' థియేట్రికల్ రైట్స్‌ను 4.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ సినిమా 2.85 మిలియన్ డాలర్లను మాత్రమే రాబట్టింది.

దీంతో బయ్యర్ పెట్టిన పెట్టుబడిని రికవరీ చేయడానికి ఇంకా గణనీయమైన మొత్తం అవసరం ఉంది.

నార్త్ అమెరికాలో ప్రస్తుతం కనిపిస్తున్న ఇదే ట్రెండ్ కొనసాగితే.. సినిమా ఫైనల్ రన్ పూర్తయ్యే సమయానికి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌కు భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ADVERTISEMENT