LOADING...
#NewsBytesExplainer: తెలంగాణ చిత్ర పరిశ్రమలో షాడో మంత్రి? ఫిల్మ్ నగర్‌ వర్గాల్లో జోరుగా చర్చలు!
తెలంగాణ చిత్ర పరిశ్రమలో షాడో మంత్రి? ఫిల్మ్ నగర్‌ వర్గాల్లో జోరుగా చర్చలు!

#NewsBytesExplainer: తెలంగాణ చిత్ర పరిశ్రమలో షాడో మంత్రి? ఫిల్మ్ నగర్‌ వర్గాల్లో జోరుగా చర్చలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2025
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటివరకు మనం ఎక్కువగా "డిఫ్యాక్టో సీఎం" అనే పదం విన్నాం కానీ, ఇటీవల కాలంలో "షాడో మినిస్టర్" అనే పదం వినిపించడం తక్కువైపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, షాడో మినిస్టర్ ఒకరు తెరమీదికి వచ్చారనే చర్చలు జరుగుతున్నాయి అదికూడా సినీ పరిశ్రమలో. సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండా షాడో మినిస్టర్‌ పనులు చక్కబెడుతున్నారనే ప్రచారానికి బలం పెరిగింది. టిక్కెట్ ధరలు పెంచడం, బెనిఫిట్ షోలు ఆమోదించడం, ఫంక్షన్‌లకు అనుమతులు ఇవ్వడం వంటి కార్యక్రమాల్లో ఆయన ద‌గ్గరే పరిష్కారం ఉందంటూ సినీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

వివరాలు 

సీఎం అండతోనే?

కాంగ్రెస్ వర్గాల్లో షాడో మినిస్టర్‌కి సీఎం అండ ఉందన్నవాదన ఉంది. హైదరాబాద్‌లోని సినీ పరిశ్రమపై ఆయన ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న సినిమాటోగ్రఫీ మంత్రికి ముఖ్య నిర్ణయాల్లో కీలక పాత్ర లేదని విమర్శలు వస్తున్నాయి. బెనిఫిట్ షోలు, కార్మికుల వేతన సమస్య, టిక్కెట్ ధరల పెంపు, సినిమా ఫంక్షన్ల అనుమతులు వంటి అంశాలు షాడో మినిస్టర్‌ కనుసైగలలో జరుగుతున్నాయని పరిశ్రమలో చర్చించుకుంటున్నారు. కొద్ది నెలలుగా షాడో మినిస్టర్‌ సాగిస్తున్న హవాపై సినిమాటోగ్రఫీ మంత్రి కూడా లోలోపల రగిలిపోతున్నారని సమాచారం. గాంధీభవన్‌లో కూడా "మంత్రిని నేను ఎందుకు? మధ్యవర్తి ఎవరు?" వంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. షాడో మినిస్టర్ అనుమతి లేకుండా ఏ నిర్ణయం తీసుకోలేమన్న భావన పరిశ్రమలో బలంగా వ్యాప్తి చెందింది.

వివరాలు 

షాడో వెనుక ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌? 

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు సంబంధిత మంత్రికి తెలియకుండా తీసుకుంటున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నారు. ఉదాహరణకు, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' చిత్ర ప్రదర్శన సమయంలో జరిగిన ఘాతుక సంఘటన తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ,ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన ఘటనను అప్పట్లో సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటన అనంతరం సీఎం అసెంబ్లీలో మాట్లాడుతూ,ఇక నుంచి తెలంగాణలో సినిమాలకు బెనిఫిట్‌ షో లు ఉండవని, టిక్కెట్ ధరలు కూడా పెంచేది లేదని ప్రకటించారు.కానీ కొన్ని రోజులలోనే టిక్కెట్ ధరలు పెంచడంపై జీవోలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం వెనుకాల షాడో తో పాటు,ఒక కార్పొరేషన్‌కు చైర్మన్‌ ఉన్నారనే టాక్ పరిశ్రమలో కోడై కూస్తున్నది.

వివరాలు 

షాడో వెనుక ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌? 

పరిశ్రమ వర్గాల ప్రకారం, షాడో మినిస్టర్ పెద్ద మొత్తంలో "ముడుపులు" చెల్లించి, టిక్కెట్ ధరల పెంపుకు హామీ ఇచ్చినట్లు భావిస్తున్నారు. భారీ నిర్మాతలు, హీరోలు సీఎంను కలిసినప్పటికీ స్పందన రాలేదు. తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా టిక్కెట్ ధరలు పెంపు కోసం జీవో జారీ చేయగా, సంబంధిత మంత్రి "తనకు తెలియదు" అని ప్రకటన ఇవ్వడం తెలియాల్సిందే. హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి తనకు తెలియకుండా ఉత్తర్వులు ఇచ్చారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాలు 

బ్లాక్‌ టికెట్ల దందా! 

షాడో మినిస్టర్‌ టిక్కెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించడాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు సినీ వర్గాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ ఏడాది జూలైలో, తెలుగు సినీ వర్కర్స్ ఫెడరేషన్ నేతలు తెలంగాణ లేబర్ కమిషనర్‌ను కలిశారు. వారు డిమాండ్లను పరిష్కరించకపోతే ఆగస్టు 1వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లి షూటింగ్ నిలిపివేస్తామని హెచ్చరించారు. ఉద్దేశం ప్రకారం, సినీ కార్మికులు 18 రోజులపాటు సమ్మె చేశారు. దీనిని పరిష్కరించమని సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి ఆదేశించారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కార్మికుల సంక్షేమం కోసం వేతనాలను పెంచాలి" అని. కానీ సంబంధిత మంత్రి ప్రతిపాదనలు సిద్ధం చేయగా, వాటిని అమలు చేయడం కష్టమని సమాచారం అందింది.

వివరాలు 

బ్లాక్‌ టికెట్ల దందా! 

షాడో మినిస్టర్ రంగంలోకి దిగి,నిర్మాతలను చైర్మన్ వద్దకు తీసుకువెళ్ళి ఆ తర్వాతనే సీఎం వద్దకు తీసుకువెళ్ళారని సచివాలయంలో వినిపిస్తోంది. ఇది షాడో మినిస్టర్‌కు విశేషాధికారం ఇచ్చిందని, సంబంధిత మంత్రికి అధికారంలో పలుకుబడి లేనట్టు చెబుతున్నారు. సినీ పరిశ్రమలో "షాడో మినిస్టర్‌కి పెత్తనం ఉంది" అనే ప్రచారం బలపడింది. షాడో మినిస్టర్ ఒక కార్పొరేషన్ చైర్మన్‌తో కలసి బ్లాక్ టికెట్ దందా నిర్వహిస్తున్నాడని చెబుతున్నారు. తాజాగా 'ఓజీ' సినిమా టిక్కెట్లు బ్లాక్ మార్కెట్లో విక్రయించబడినట్లు ప్రచారం జోరందుకుంది. హరిహర వీరమల్లు సినిమాకు ప్రత్యేక రాయితీల వెనక కూడా ఆయన ఉన్నారనే కథనం వినిపిస్తోంది. కొందరు నిర్మాతలు ఆయన దయ వల్లే తమ సినిమాలకు టిక్కెట్ ధరల పెంపు,ప్రత్యేక షోలను సాధించారని మీడియా వేదికపై పేర్కొన్నారు.