Loading...
Shah Rukh Khan: రూ.2,490 కోట్లు తగ్గిన షారుక్‌ ఖాన్‌ ఆస్తి.. అయినా కింగే నంబర్‌ 1
రూ.2,490 కోట్లు తగ్గిన షారుక్‌ ఖాన్‌ ఆస్తి.. అయినా కింగే నంబర్‌ 1

Shah Rukh Khan: రూ.2,490 కోట్లు తగ్గిన షారుక్‌ ఖాన్‌ ఆస్తి.. అయినా కింగే నంబర్‌ 1

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2026
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నికర ఆస్తుల విలువ గతేడాదితో పోలిస్తే తగ్గింది. అయినప్పటికీ దేశంలో అత్యంత ధనవంతుడైన నటుడిగా ఆయన తన అగ్రస్థానాన్ని కొనసాగించారు. 'హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2026' నివేదిక ప్రకారం.. షారుక్‌ ఖాన్‌ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.10,000 కోట్లుగా ఉంది. రూ.2,490 కోట్ల తగ్గుదల.. గత ఏడాది హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌లో షారుక్‌ ఖాన్‌ సంపద విలువ రూ.12,490 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది అది రూ.2,490 కోట్లు తగ్గి రూ.10,000 కోట్లకు చేరినట్లు నివేదిక అంచనా వేసింది. సంపద విలువలో తగ్గుదల కనిపించినప్పటికీ.. నటుల్లో అత్యంత సంపన్నుడిగా షారుక్‌ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

వివరాలు 

వ్యాపారాల వాటాలనూ పరిగణనలోకి..

షారుక్‌ ఖాన్‌ మొత్తం సంపదను అంచనా వేసేటప్పుడు ఆయనకు సంబంధించిన వివిధ వ్యాపారాలను కూడా హురున్‌ నివేదిక పరిగణనలోకి తీసుకుంది.

ముఖ్యంగా ఆయన నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్పోర్ట్స్‌ వ్యాపారాల్లో ఉన్న భాగస్వామ్యాలు, వాటాలను లెక్కలోకి తీసుకున్నట్లు పేర్కొంది.

తర్వాతి స్థానాల్లో అమితాబ్‌, సల్మాన్‌, హృతిక్‌..

ధనవంతులైన భారతీయ నటుల జాబితాలో షారుక్‌ తర్వాత అమితాబ్‌ బచ్చన్‌ రెండో స్థానంలో నిలిచారు.

ఆయన నికర ఆస్తుల విలువ రూ.4,000 కోట్లుగా అంచనా వేశారు. రూ.3,000 కోట్ల సంపదతో సల్మాన్‌ ఖాన్‌ మూడో స్థానంలో ఉండగా.. రూ.2,500 కోట్ల ఆస్తులతో హృతిక్‌ రోషన్‌ నాలుగో స్థానంలో నిలిచారు.

వివరాలు 

'కింగ్‌'పై భారీ అంచనాలు..

ప్రస్తుతం షారుక్‌ ఖాన్‌ తన తదుపరి చిత్రం 'కింగ్‌'తో బిజీగా ఉన్నారు.

సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో షారుక్‌ కుమార్తె సుహానా ఖాన్‌ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.

సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో షారుక్‌ అభిమానుల్లో 'కింగ్‌' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ADVERTISEMENT