
Vijay Devarakonda: "షారుక్ ఖాన్ మాటను తప్పు అనాలని అనిపించింది": విజయ్ దేవరకొండ
ఈ వార్తాకథనం ఏంటి
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం 'కింగ్‌డమ్' షూటింగ్‌ను పూర్తిచేశారు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
మొదట మే 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని జూలై 4వ తేదీకి వాయిదా వేశారు.
ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విజయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ గురించి తన భావాలు తెలిపారు.
వివరాలు
"నువ్వు చేస్తే నేను ఎందుకు చేయలేనని అనిపించింది"
షారుక్ ఖాన్ తనకు ఎంతో ప్రేరణనిచ్చిన వ్యక్తి అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
"ఎవరో విజయాన్ని సాధించినప్పుడు...నన్ను నేను ఎందుకు చేయలేనని అనుకునే వాడిని.షారుక్ ఖాన్ విజయం నాకు ఎంత ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందో చెప్పలేను. ఆ విజయంతో నాకు కొన్ని విషయాల్లో స్పష్టత వచ్చింది. అతను చేశాడు కాబట్టి, నేను చేయలేనా అన్న ఆలోచన కలిగింది. ఒక విజేతను ప్రేరణగా తీసుకోవాలి. నేను ఇంకా పెద్దగా గుర్తింపు పొందకముందే చాలా సినిమాలను తిరస్కరించాను. ఎందుకంటే నేను పెద్ద విషయాల కోసం వచ్చాననే నమ్మకం నాకు ఉండేది. అయితే చాలా మంది మాత్రం, ఇలా ఉంటే ఎప్పటికీ అవకాశాలు రావని చెప్పారు. కానీ నాకు నాపై ఎంతో నమ్మకం ఉండేది" అని ఆయన వివరించారు.
వివరాలు
"షారుక్‌కి చెప్పాలనిపించిన మాట"
ఒక ఇంటర్వ్యూలో షారుక్ ఖాన్ తనే స్టార్‌లలో చివరివాడినని అన్నారని విజయ్ గుర్తుచేశారు.
"నేను ఆ ఇంటర్వ్యూని చూస్తున్నప్పుడు... నాలో ఏదో కదలిక కలిగింది. షారుక్, నువ్వు తప్పు... నువ్వు చివరి స్టార్ కాదని, నేనూ వస్తున్నానని చెప్పాలనిపించింది" అని విజయ్ చెప్పారు.
షారుక్ ఖాన్ వ్యాఖ్యల నేపథ్యం
'అనుపమ్ ఖేర్ షో'లో ఒక ఎపిసోడ్‌ల షారుక్ ఖాన్ అతిథిగా పాల్గొన్నారు.అప్పుడు అనుపమ్ ఖేర్ "మీ విజయాన్ని ఎవరైనా అధిగమించగలరా?"అన్న ప్రశ్నకు షారుక్ స్పందిస్తూ.."లేదు, అది అసాధ్యం. నిజం చెప్పాలంటే... స్టార్‌లలో నేను చివరివాణ్ని" అని వ్యాఖ్యానించారు.
ఆయన మాటలు విన్న వారందరూ ఆనందోత్సాహాలతో స్పందించారు. అయితే ఆ వ్యాఖ్యతో విజయ్ ఏకీభవించలేదని , తాను తప్పు అని చెప్పాలనుకున్నానని వెల్లడించారు.
వివరాలు
బహుభాషల్లో విడుదలకానున్న 'కింగ్‌డమ్'
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన 'కింగ్‌డమ్' చిత్రం రూ. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది.
జూలై 4న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మితమవుతోంది.
మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్ పనిచేశారు. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు.