Biker : శర్వానంద్ 'బైకర్' రిలీజ్ పోస్ట్‌పోన్.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
శర్వానంద్ ప్రధాన పాత్రలో బైక్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా 'బైకర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో శర్వాతో కలిసి మలయాళ కుట్టీ, నేషనల్ అవార్డు విన్నర్ మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మా నాన్న సూపర్ హీరో ఫేం అభిలాస్ కంకర దర్శకత్వం వహిస్తుండగా, యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రారంభంలో ఈ సినిమాను డిసెంబర్ 6న థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
Details
సీజీ వర్క్స్ పూర్తికాలేదట
అయితే డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న బాలకృష్ణ అఖండ 2తో నేరుగా పోటీ పడబోతున్న నేపథ్యంలో శర్వానంద్ కూడా ప్రమోషన్స్‌ను వేగంగా ప్రారంభించాడు. కాలేజీలు సందర్శిస్తూ సినిమా ప్రమోట్ చేస్తుండగా, అకస్మాత్తుగా ప్రమోషనల్ యాక్టివిటీస్‌కు బ్రేక్ ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై పరిశ్రమలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. అసలుకు 'బైకర్'లోని కొన్ని కీలక సీజీ వర్క్స్ పూర్తికాలేదట. నిర్ణయించిన తేదీకి క్వాలిటీ కంటెంట్ అందించలేమని భావించిన మేకర్స్, రిలీజ్‌ను వారం వెనక్కి మార్చాలని నిర్ణయించుకున్నారట.
Details
అఖండ 2' ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్
ఇక దీనికి తోడు 'అఖండ 2' ట్రైలర్‌కు వచ్చిన సూపర్ రెస్పాన్స్, పాన్ ఇండియా రిలీజ్ ప్లానింగ్, అలాగే ఇన్‌సైడ్ టాక్ కూడా చాలా పాజిటివ్‌గా ఉండటం వల్ల బాలయ్యతో పోటీని తప్పుకోవడం మంచిదని శర్వానంద్ టీమ్ భావించినట్టు తెలుస్తోంది. సోలో రిలీజ్‌కు వెళితే మంచి ఓపెనింగ్ రావచ్చని, పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల పరంగా కూడా మంచి బెనిఫిట్ ఉంటుందని మేకర్స్ అంచనా. ఇలా 'బైకర్' విడుదలను వారం పాటు వాయిదా వేసి, క్లియర్ స్లాట్‌లో విడుదల చేయాలని టీమ్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం మంచి సైన్‌గా భావిస్తున్నారు.