Loading...
Sharwanand George Krish : శర్వానంద్‌ కొత్త సినిమా మొదలైంది.. శ్రీను వైట్లతో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌!
శర్వానంద్‌ కొత్త సినిమా మొదలైంది.. శ్రీను వైట్లతో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌!

Sharwanand George Krish : శర్వానంద్‌ కొత్త సినిమా మొదలైంది.. శ్రీను వైట్లతో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2026
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న మరో కొత్త చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించనున్న ఈ సినిమా 'ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా' రూపొందనుంది. 'జార్జ్‌ క్రిష్‌'గా శర్వా.. శర్వానంద్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు 'జార్జ్‌ క్రిష్‌' (George Krish) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ క్లాప్‌ కొట్టగా.. ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు.

వివరాలు

శ్రీనువైట్లకు మరో ఛాన్స్‌..

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అజయ్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'జనవరి 14న' సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించనున్నారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఒకప్పుడు 'ఢీ', 'వెంకీ', 'దుబాయ్‌ శీను' వంటి వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీనువైట్ల. ఆ తర్వాత కొన్ని సినిమాలు విజయాలు అందుకోలేదు.

రెండేళ్ల క్రితం గోపీచంద్‌ హీరోగా 'విశ్వం' చిత్రాన్ని రూపొందించినప్పటికీ.. అది కూడా అనుకున్నంత సక్సెస్‌ సాధించలేదు.

చాలా కాలం తర్వాత శ్రీనువైట్ల ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో 'జార్జ్‌ క్రిష్‌' ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.

వివరాలు

'భోగి'తో త్వరలో శర్వా..

మరోవైపు శర్వానంద్‌ ఈ ఏడాది 'నారీ నారీ నడుమ మురారి'తో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో 'భోగి' సినిమా చేస్తున్నారు.

ఈ చిత్రం ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నేపథ్యంలో సాగే పీరియాడికల్‌ కథగా 'భోగి'ని పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

ఇందులో శర్వానంద్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు.

అనుపమ 'కందుల సులోచన రాణి' అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుండగా.. డింపుల్‌ హయాతి 'మందారం' అనే బోల్డ్‌ రోల్‌లో నటిస్తున్నారు.

ADVERTISEMENT