LOADING...
Nari Nari Naduma Murari Review : పండక్కి ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఫుల్ గా నవ్వుకునే.. 'నారీ నారీ నడుమ మురారి' 
పండక్కి ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఫుల్ గా నవ్వుకునే.. 'నారీ నారీ నడుమ మురారి'

Nari Nari Naduma Murari Review : పండక్కి ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఫుల్ గా నవ్వుకునే.. 'నారీ నారీ నడుమ మురారి' 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

హీరో శర్వానంద్, హీరోయిన్స్ సంయుక్త, సాక్షి వైద్య ప్రధాన పాత్రల్లో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో, అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలయ్యింది.

కథ

కథ విషయానికొస్తే.. 

గౌతమ్ (శర్వానంద్)నిత్య (సాక్షి వైద్య) ప్రేమించుకుంటారు. పెళ్లి గురించి మాట్లాడటానికి నిత్య తండ్రి సంపత్ వద్ద వెళ్ళినప్పటికీ, మొదట అతను "నో" చెబుతాడు. కానీ కూతురి బాధ చూసి చివరికి "ఓకే" అంటాడు. ఇంతలో, 60 ఏళ్ల గౌతమ్ తండ్రి కార్తీక్ (నరేష్) 25 ఏళ్ల సిరి హనుమంత్‌ను ప్రేమించి వివాహం చేసుకుంటాడు. ఈ పెళ్ళి గౌతమ్ దగ్గరుండి జరిపిస్తాడు.ఇది నచ్చని నిత్య తండ్రి ఇదే సాకు చూపించి రిజిస్టర్ మ్యారేజ్ అయితేనే ఓకే అని కండిషన్ పెడతాడు. అయితే, గౌతమ్ కాలేజీ రోజుల్లో దియా (సంయుక్త మీనన్)తో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. తర్వాత వారు విడిపోయి వేరే జీవితం కొనసాగిస్తారు.

కథ 

కథ విషయానికొస్తే.. 

దియాని పెళ్లి చేసుకున్నరిజిస్టర్ ఆఫీస్ లోనే నిత్యతో పెళ్లి చేసుకుంటున్న గౌతమ్ అక్కడి ఆఫీసర్(సునీల్) గుర్తుపట్టడంతో షాక్ అవుతాడు. డైవర్స్ లేకుండా ఈ వివాహం జరగదని బెదిరించడం వంటి సీక్వెన్స్‌లు కథను హాస్యభరితంగా, ఉత్కంఠతో నింపుతాయి. గౌతమ్-నిత్య పెళ్లి జరుగుతుందా? దియా మళ్ళీ గౌతమ్ జీవితం లోకి ఎలా వస్తుంది? 60 ఏళ్ల కార్తీక్ ప్రేమకథ ఎలా ముగుస్తుంది? వీటికి సమాధానాల కోసం సినిమా తెరపై చూడాల్సి ఉంటుంది.

Advertisement

విశ్లేషణ 

సినిమా విశ్లేషణ

"నారీ నారీ నడుమ మురారి" అనే టైటిల్, సంక్రాంతి విడుదల, ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ సన్నివేశాల కాన్సెప్ట్, సామజవరగమన దర్శకుడు దర్శకత్వం, ట్రైలర్ ఫీడ్ అన్ని కలిపి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. ఫస్ట్ హాఫ్ అంతా గౌతమ్-నిత్య లవ్ స్టోరీ,దియా-గౌతమ్ లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లతో,కార్తీక్ లవ్ స్టోరీతో కామెడీతో పాటు ప్రేమ కథలతో సాగుతుంది. ఇంటర్వెల్ కి దియా ఎంట్రీతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో దియా-నిత్య-మధ్యలో గౌతమ్ నలిగిపోయే కథనంతో ఫుల్ గా నవ్విస్తారు. గౌతమ్ తండ్రి కార్తీక్ ప్రేమకథ,భార్య గర్భవతి అవడం,దియా విషయాన్ని నిత్య తండ్రికి తెలియకుండా రక్షించుకునే ప్రయత్నాలు హిలేరియస్ కామెడీ వర్కౌట్ చేసి ఫుల్ గా నవ్విస్తారు.

Advertisement

నటీనటులు 

నటీనటుల ప్రదర్శనలు

క్లైమాక్స్‌లో కొంత ఎమోషన్ కూడా చేర్చారు. పెళ్లి, ప్రేమ సంబంధాలపై కొన్ని డైలాగ్స్ ఎమోషన్‌తో కూడిన విధంగా సాగాయి. చివర్లో శ్రీవిష్ణు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి సినిమాకి మంచి ఎండింగ్ ఇస్తాడు. శర్వానంద్: స్టైలిష్, స్లిమ్ లుక్, పెళ్లి కోసం తటస్థత చూపే పాత్రలో బాగా నటించారు. సాక్షి వైద్య: గౌతమ్-నిత్య ప్రేమ కథలో క్యూట్ ప్రదర్శన. సంయుక్త మీనన్: ప్రేమ కథలో,రీ-ఎంట్రీ సీన్‌లో రెండు వేరియేషన్స్‌లో బాగా నటించారు. నరేష్: సీనియర్ హీరోగా హైలెట్; కామెడీ సీన్స్‌లో ప్రత్యేక హవ్. సిరి హనుమంత్: పాత్రలో ఫుల్ అంగీకారం,ఒదిగిపోయిన ప్రదర్శన. సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్, సంపత్,సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్,గెటప్ శ్రీను అందరూ వారి పాత్రల్లో మెప్పించారు. శ్రీవిష్ణు: గెస్ట్ రోల్‌లో ఆకట్టుకున్నారు.

వివరాలు 

సాంకేతిక అంశాలు

సినిమాటోగ్రఫీ: కలర్‌ఫుల్, రిచ్ విజువల్స్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: కామెడీ సీన్స్‌ను ఎలివేట్ చేస్తుంది. పాటలు: బాగున్నాయి. ఎడిటింగ్: ఫ్లాష్ బ్యాక్ సీన్స్ స్పష్టంగా, ల్యాగ్ లేకుండా. డైలాగ్స్: చాలామంది పేలిపోతాయి. నిర్మాణం: ఖర్చుపెట్టినట్టు తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. "నారీ నారీ నడుమ మురారి" యూత్ ఫుల్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ, ఫుల్ హిలేరియస్ ఎంటర్టైన్‌మెంట్ సినిమా. సంక్రాంతి పండుగలో ఫ్యామిలీతో ఫుల్ నవ్వుతూ చూడవచ్చు. టికెట్ రేట్లు పెంచకపోవడం కూడా ప్లస్ పాయింట్. రేటింగ్: 3.25 / 5

Advertisement