LOADING...
Mana Shankara Varaprasad Garu: 'మన శంకర వరప్రసాద్‌ గారు' నుంచి శశిరేఖ సాంగ్ రిలీజ్… అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్!

Mana Shankara Varaprasad Garu: 'మన శంకర వరప్రసాద్‌ గారు' నుంచి శశిరేఖ సాంగ్ రిలీజ్… అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2025
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్‌ గారు' (Mana Shankara Varaprasad Garu)గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నయనతార కనిపించనున్నారు. మూవీని 2026 సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో, తాజా అప్‌డేట్‌తో మూవీ టీమ్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ముందుగా సోమవారం విడుదల చేయనున్నట్టు ప్రకటించిన 'శశిరేఖ' (Sasirekha Song) లిరికల్ వీడియోను, అభిమానుల భారీ ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఒకరోజు ముందుగానే రిలీజ్ చేశారు.

Details

లిరిక్స్ అందించిన అనంత శ్రీరామ్

ఈ మెలోడీ సాంగ్‌ను అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, భీమ్స్ స్వీయ సంగీత దర్శకత్వంలో స్వరపరిచారు. భీమ్స్, మధుప్రియ కలిసి ఈ పాటను ఆలపించారు. విడుదలైన వెంటనే 'శశిరేఖ' లిరికల్ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

Advertisement