
Shahrukh Khan: ఆ రోజు ఆమె ఏడవలేదు.. ఎమోషనల్ అయిన షారుక్ ఖాన్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కెరీర్ ప్రారంభంలో టీవీ సీరియల్స్ ద్వారా రంగప్రవేశం చేసిన షారుక్, తర్వాత సినిమాల ద్వారా అంచెలంచెలుగా ఎదిగి, బాలీవుడ్‌లో టాప్ హీరోగా స్థిరపడ్డాడు.
తన 30 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఘనతలు అందుకుంటూ, తన సినిమాలతో కోట్లాది మంది అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు.
కొంతకాలం బ్రేక్ తీసుకున్న ఆయన, తిరిగి 'పఠాన్', 'జవాన్' వంటి బ్లాక్‌బస్టర్లతో తిరిగి ఫామ్ లోకి వచ్చి, బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
ప్రస్తుతం పలు చిత్రాలు షారుక్ లైన్‌లో పెట్టగా, మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఎమోషనల్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
Details
ఒత్తిడి లేకుండా జీవించాలి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో షారుక్ మాట్లాడుతూ నా తల్లిదండ్రుల మరణం నా సోదరిపై తీవ్ర ప్రభావం చూపింది. తండ్రి మృతదేహం ముందు నిలబడి ఆమె ఏడవలేదు.
ఆ సంఘటన నుంచి కోలుకోవడానికి ఆమెకు రెండు సంవత్సరాలు పట్టింది. అప్పట్లో ఆ బాధను చూసిన తర్వాతే నాకు ఒక నిర్ణయం వచ్చింది - నేను ఆమెలా డిప్రెషన్‌లోకి వెళ్లకూడదనుకున్నాను.
అందుకే నన్ను బిజీగా ఉంచుకునేందుకు సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చాను.
నా జీవితంలో డబ్బు, పేరు, గుర్తింపు కంటే ముఖ్యమైంది మనస్సులో ఒత్తిడి లేకుండా ఉండటనని భావోద్వేగంగా వివరించారు.