Kareena Kapoor: యష్‌తో కలిసి నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ ఏజ్ పెరుగుతున్నా, తన గ్లామర్‌తో వరుస అవకాశాలను సాధిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్‌గా రాణిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి ఆమె మెప్పించింది. తర్వాత సైఫ్ ను పెళ్లి చేసుకుంది. తాజాగా ఆమె దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసింది. ఈ సందర్భంగా తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ క్రమంలో కరుణ్ జోహర్ సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఏ హీరోతో నటించాలని ఉందని అడగ్గా, కరీనా యష్ తో నటించాలని పేర్కొంది.
కేజీఎఫ్ గర్ల్ అని పిలిపించుకోవాలని ఉంది
కేజీఎఫ్ సినిమా బాగా నచ్చిందని, అవకాశం వస్తే యష్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని కరీనా చెప్పింది. తనకు కేజీఎఫ్ గర్ల్ అని పిలిపించుకోవాలని ఉందని వెల్లడించింది. సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కుమార్తె సారా అలీఖాన్ తో తల్లిగా నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని, ఇందులో ఎలాంటి సందేహం లేదని కరీనా చెప్పుకొచ్చింది. తర్వాత కరణ్ జోహార్ అమీషా పటేల్ ప్రస్తావన తేవడంతో కరీనా సమాధానం చెప్పకుండా సైలెంట్ అయ్యింది.