English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / శేఖర్ మాస్టర్ చూపు సినిమా దర్శకత్వం వైపు ?
    తదుపరి వార్తా కథనం
    శేఖర్ మాస్టర్ చూపు సినిమా దర్శకత్వం వైపు ?
    డైరెక్షన్ లోకి దిగుతున్న శేఖర్ మాస్టర్?

    శేఖర్ మాస్టర్ చూపు సినిమా దర్శకత్వం వైపు ?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 11, 2023
    04:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొరియోగ్రాఫర్లు సినిమా దర్శకులుగా మారడం చాలాసార్లు జరుగుతుంటుంది. ప్రభుదేవా, అమ్మ రాజశేఖర్, సన్నీ మొదలగు కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారారు.

    ప్రస్తుతం ఈ జాబితాలోకి శేఖర్ మాస్టార్ కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. అటు కొరియోగ్రాఫర్ గా ఇటు టీవీ షోలకు జడ్జిగా చాలా బిజీగా ఉండే శేఖర్ మాస్టర్, పూర్తి సినిమా కోసం మెగాఫోన్ పట్టుకున్నాడని వినిపిస్తోంది.

    ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తయ్యిందనీ సమాచారం. కాకపోతే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు కానీ, తాను దర్శకత్వం చేస్తున్న విషయాన్ని గానీ ఇప్పుడప్పుడే బయటకు చెప్పవద్దని శేఖర్ మాస్టర్ అనుకుంటున్నారట.

    సినిమా మొత్తం పూర్తయ్యి ఫైనల్ కాపీ వచ్చాకే జనాలకు రివీల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

    శేఖర్ మాస్టర్

    శేఖర్ మాస్టర్ దర్శకత్వం చేస్తున్న సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరంటే?

    శేఖర్ మాస్టర్, ఒక సినిమాకు దర్శకత్వం చేస్తున్నాడనే వార్త బయటకు వచ్చిందనగానే అందులో హీరో హీరోయిన్లు ఎవరనే ప్రశ్న అందరిలోనూ కలిగింది. ప్రస్తుతానికి ఆ వివరాలు తెలియదు.

    పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అదలా ఉంచితే గతంలో కొరియోగ్రాఫర్ నుండి దర్శకులుగా మారిన వారిలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.

    ప్రభుదేవాకు మొదట్లో మంచి విజయాలు దక్కినా ఆ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇక రాఘవ లారెన్స్ అయితే హార్రర్ చిత్రాలు తప్ప మరో సినిమాల వైపు వెళ్ళడం లేదు.

    మరి శేఖర్ మాస్టర్ నుండి ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి. కొరియోగ్రాఫర్ గా సక్సెస్ అయినట్టు దర్శకుడిగా విజయం తెచ్చుకుంటాడేమో చూడాలి.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    తెలుగు సినిమా

    బుట్టబొమ్మ ట్రైలర్ టాక్: మలుపులతో కూడిన ప్రేమకథ ట్రైలర్ టాక్
    బాలయ్య తర్వాతి సినిమాకు హీరోయిన్ కష్టాలు తీరినట్లే? బాలకృష్ణ
    భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్: తెలుగులో మరో డిటెక్టివ్ మూవీ ట్రైలర్ టాక్
    ఘనంగా ప్రారంభమైన పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025