Page Loader
Kantara 2: 'కాంతార చాప్టర్ 1' షూటింగ్.. అటవీ ప్రాంతం నాశనం? కేసు నమోదు!
'కాంతార చాప్టర్ 1' షూటింగ్.. అటవీ ప్రాంతం నాశనం? కేసు నమోదు!

Kantara 2: 'కాంతార చాప్టర్ 1' షూటింగ్.. అటవీ ప్రాంతం నాశనం? కేసు నమోదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2025
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కాంతార చాప్టర్‌ 1'. 2022లో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. 'కాంతార'కు ఈ చిత్రం ప్రీక్వెల్‌గా రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ కర్ణాటకలోని గవి గుడ్డ, హేరూరు అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రబృందం ఒక సమస్యను ఎదుర్కొంది. అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరపడంతో ఈ ప్రాంతం నాశనమవుతోందని స్థానికులు ఆరోపించారు. వారు పోలీసులను ఆశ్రయించి, చిత్రబృందం అటవీ ప్రాంతంలో అక్రమంగా షూటింగ్ చేసి, పేలుడు పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా అక్కడి మూగ జీవాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వారు తెలిపారు.

Details

యువకుడిపై చిత్రబృందం దాడి

ఈ అంశంపై స్థానికులు చిత్రబృందాన్ని సంప్రదించగా, రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనా స్థలంలో గ్రామానికి చెందిన ఓ యువకుడిపై చిత్రబృందం దాడి చేసినట్లు ఆరోపణలు లేవటంతో స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై యెసలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దీనిపై త్వరగా స్పందించి, తగిన చర్యలు తీసుకోకపోతే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని స్థానికులు వెల్లడించారు. రిషభ్‌ స్వీయ దర్శకత్వంలో పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Details

కీలక పాత్రలో జయరాజ్

హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయరామ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కదంబుల కాలంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రిషభ్‌ శెట్టి గత కొంతకాలంగా కలరిపయట్టు యుద్ధ విద్యలో కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమా 2024 అక్టోబర్‌ 2న విడుదల చేసే ప్రణాళికతో చిత్రం బృందం ముందుకు సాగుతోంది.