Loading...
Akshay Kumar: టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు.. భద్రత పెంచుకుంటున్న బాలీవుడ్‌ స్టార్స్‌!
టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు.. భద్రత పెంచుకుంటున్న బాలీవుడ్‌ స్టార్స్‌!

Akshay Kumar: టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు.. భద్రత పెంచుకుంటున్న బాలీవుడ్‌ స్టార్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2026
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు జరిగిన ఘటనతో సినీ పరిశ్రమలో ప్రముఖుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్‌ నటుల ఇళ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేస్తున్నారు. పోలీసుల నిఘాను కూడా పెంచుతున్నారు. వరుస పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) తన నివాసంలో కిటికీలు, తలుపులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాసులను ఏర్పాటు చేయిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)కు ఇప్పటికే వై ప్లస్‌ (Y+) భద్రత ఉంది. అయినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

వివరాలు

భద్రతలపై పోలీసులు ప్రత్యేక దృష్టి

ఇక నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) ఇంటి వద్ద కూడా నిందితులు రెక్కీ నిర్వహించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన సైతం తన నివాసానికి అదనపు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇతర బాలీవుడ్‌ ప్రముఖుల భద్రతా పరిస్థితులపైనా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

కాగా, టైగర్‌ ష్రాఫ్‌ (Tiger Shroff) కారుపై అక్టోబర్‌ 18న ముంబయిలోని జుహు ప్రాంతంలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయనకు ప్రాణాపాయం తప్పింది.

అయితే ఈ దాడి వెనుక ఎవరున్నారు? అసలు దుండగుల లక్ష్యం టైగర్‌ ష్రాఫేనా? లేక మరికొందరు బాలీవుడ్‌ ప్రముఖులను కూడా లక్ష్యంగా చేసుకున్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ADVERTISEMENT