దసరా లోపు ప్రభాస్ పెళ్ళి: క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి
తెలుగు సినిమా పరిశ్రమలో పెళ్లి గురించి టాపిక్ ఎత్తగానే అందరికీ మొదటగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటే ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ సోషల్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. తాజాగా ప్రభాస్ పెళ్లి విషయమై దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి క్లారిటీ ఇచ్చారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న శ్యామల దేవి ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడారు. ప్రభాస్ కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని, వచ్చే దసరా లోపు ప్రభాస్ పెళ్లి అవుతుందని శ్యామలాదేవి అన్నారు.
పెళ్లికూతురు ఎవరంటే?
వచ్చే దసరా లోపు ప్రభాస్ పెళ్లి అవుతుందని చెప్పిన శ్యామలాదేవి, పెళ్లికూతురు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడి చేయలేదు. ఆ విషయాన్ని త్వరలో తెలుస్తాయని, తమ ఇంట్లో శుభకార్యం ఉంటుందని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. అయితే గతంలో కూడా ప్రభాస్ పెళ్లి విషయమై శ్యామలాదేవి ఇలానే మాట్లాడారు. కాకపోతే రోజులు గడుస్తున్నా కూడా ప్రభాస్ పెళ్లిపై ఎలాంటి అప్డేట్ రాలేదు. అదలా ఉంచితే, ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇంకా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి సినిమాను, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మారుతి రూపొందిస్తున్న రాజా డీలక్స్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు.