
సింగర్ జానకి బర్త్ డే: పద్మభూషణ్ ని తిరస్కరించిన జానకి జీవితంలోని ఆసక్తికర విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్ జానకి. తెలుగు రాష్ట్రంలో జన్మించి భారతదేశ వ్యాప్తంగా 25భాషల్లో పాటలు పాడారు. 48వేలకు పైగా సినిమా పాటలు పాడిన జానకి బర్త్ డే ఈరోజు.
ఈ నేపథ్యంలో ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాల గురించి మాట్లాడుకుందాం.
మొదటి సంవత్సరంలో వంద పాటలు పూర్తి:
తెలుగు రాష్ట్రంలో జన్మించిన జానకి, మొదటగా తమిళ సినిమా కోసం తన గొంతునందించారు. ఆ తర్వాత అదే సంవత్సరం దక్షిణాది భాషలన్నింటిలోను వందకు పైగా పాటలు పాడారు.
కెరీర్ మొదటి సంవత్సరంలోనే వంద పాటలు పూర్తి చేయడం రికార్డుగా నిలిచింది.
48వేలకు పైగా పాటలు:
25భాషల్లో ఇప్పటివరకు 48వేలకు పైగా పాటలు పాడారు జానకి. దాదాపుగా భారతదేశంలోని అన్ని భాషల్లోను ఆమె పాటలు పాడారు.
Details
విదేశీ భాషల్లో జానకి స్వరం
సింగర్ చిత్రను ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పిన జానకి:
కొత్త వాళ్ళను ప్రోత్సహించడంలో జానకి ముందుంటారు. అప్పట్లో సింగింగ్ సెన్సేషన్ చిత్ర దూసుకువస్తున్నప్పుడు, ఒకానొక పాత్రికేయుడు జానకి ఇంటర్వ్యూ కోసం వెళ్తే, ఇప్పుడు చిత్ర బాగా పాడుతుందని, ఆమె ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పారు.
రంగు చీరలు మానేసిన జానకి:
తన భార్త రామ్ ప్రసాద్ 1997లో కాలం చేసిన తర్వాత రంగు చీరల వైపు జానకి వెళ్ళలేదు. అప్పటి నుండి తెలుపు చీరలోనే కనబడుతున్నారు.
విదేశీ భాషల్లో పాడిన జానకి:
భారతదేశ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్, జర్మన్, జపనీస్, సింహాళం వంటి విదేశీ భాషల్లోనూ తన గొంతును వినిపించారు.
Details
భారత అత్యుత్తమ పురస్కారాన్ని తిరస్కరించిన జానకి
పద్మభూషణ్ తిరస్కరణ:
2013లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. కానీ కెరీర్ చివరిదశలో అవార్డు వచ్చిందన్న కారణంగా పురస్కారన్ని జానకి తిరస్కరించారు.
కెరీర్ పీక్స్ లో ఉండగా ఇస్తే ప్రోత్సాహంగా ఉండేదని, ఐదు దశాబ్దాల కెరీర్ దాటిన తర్వాత అవార్డుతో పెద్ద ప్రయోజనం ఉండదని ఆమె అన్నారు.
రిటైర్మెంట్ ని వెనక్కి:
2016లో తాను పాటలను పాడడం ఆపేస్తున్నట్లు జానకి ప్రకటించారు. కానీ అభిమానుల నుండి ఒత్తిడి రావడంతో రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకుని పాటల ప్రయాణాన్ని మళ్ళీ మొదలెట్టారు. 2018లో పన్నాడి అనే సినిమా కోసం ఉన్ ఉసురు కత్తుల అనే పాటను పాడారు.