Page Loader
స్కంద నుంచి మరో అప్ డేట్.. గందరబాయి వీడియో పాట విడుదల
స్కంద నుంచి మరో అప్ డేట్

స్కంద నుంచి మరో అప్ డేట్.. గందరబాయి వీడియో పాట విడుదల

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 04, 2023
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కంద సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈసారి మాస్ సాంగ్ గందరబాయి వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ఈ సినిమాలోని పాటలు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, గందరబాయ్‌ పాటకు మాత్రం థియేటర్‌లో మాంచి రెస్పాన్స్‌ వచ్చింది.రామ్ పోతినేని, శ్రీలీల ఎనర్జీ స్టెప్పులకు ప్రేక్షకులు చిందులేశారు. అయితే ఈ చిత్రం ఆశించిన మేర ఫలితం ఇవ్వకపోవడంతో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే ఎత్తుగడలో భాగంగా తాజాగా వీడియో సాంగ్‌ను రిలీజ్‌ అయ్యింది. అయితే హిట్ టాక్ రాకపోయినా స్కంద సినిమా గత ఐదు రోజులుగా కోట్లు కొల్లగొడుతోంది.టాక్ తో సంబంధం లేకుండా సోమవారం సైతం కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రూ.7 కోట్ల వరకు వసూలు సాధించించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు గందరబాయి సాంగ్ రిలీజ్