Page Loader
Sarkaar Season 4: 'సర్కార్ 'సీజన్ 4కి కొత్త హోస్ట్.. ఎవరంటే..? 
'సర్కార్ 'సీజన్ 4కి కొత్త హోస్ట్.. ఎవరంటే..?

Sarkaar Season 4: 'సర్కార్ 'సీజన్ 4కి కొత్త హోస్ట్.. ఎవరంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2024
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

సెన్సేషనల్ రియాలిటీ గేమ్ షో 'సర్కార్' 4వ సీజన్‌కు సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తారని తెలుగు ఓటిటి ప్లాట్‌ఫాం ఆహా ప్రకటించింది. అంతకముందు,'సర్కార్' కి యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు వ్యవహరించాడు.సీజన్ 4 కు హోస్ట్ గా సుడిగాలి 'సుధీర్ చేయబోతున్నాడు. ఇక ఈ కొత్త సీజన్ త్వరలోనే మొదలు కాబోతోంది.సుధీర్ తనదైన స్టైల్ లో నవ్వులు పూయించి ఎదుటివారిని సంతోషపరచడంలో దిట్ట అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకోసం సుడిగాలి సుధీర్ సక్సెస్ సాధిస్తాడన్న నమ్మకంతో ఆహా ఆ బాధ్యతను సుధీర్ కి అప్పగించింది.

Details 

 ఓటీటీలోకి ఎంటర్ అయ్యిన సుధీర్ 

ఈ షోకి అంతకముందు రానా, సాయి పల్లవి, సిద్దు, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, ప్రియమణి లాంటి సెలబ్రిటీలు వచ్చారు. ఈ నాలుగో సీజన్ లో ఎటువంటి స్టార్ హీరో హీరోయిన్లు వస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. స్టార్ మా, జి తెలుగు లాంటి అనేక ఛానల్ లో హోస్ట్ గా ఉన్న సుధీర్ ప్రస్తుతం ఓటీటీలోకి కూడా ఎంటర్ అయ్యాడు. సుధీర్ హోస్ట్‌గా ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి.