
Naga Chaitanya: శోభిత ఇచ్చే సలహాలు నాకు ఎంతో ముఖ్యం.. నాగచైతన్య
ఈ వార్తాకథనం ఏంటి
నటుడు నాగ చైతన్య తన జీవితంలోని ప్రతీ విషయం సతీమణి శోభితా ధూళిపాళ్లతో ఆనందంగా పంచుకుంటానని తెలిపారు.
అయోమయంలో ఉన్నప్పుడు ఆమె ఎంతో మద్దతుగా నిలిచేలా ఉంటుందని, సరైన సూచనలు ఇస్తుందని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
శోభితాతో జీవితం పంచుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఆమెతో ప్రతి విషయమూ షేర్ చేసుకోవడం తనకు చాలా ఇష్టమన్నారు. తన ఆలోచనలన్నింటినీ తనతో పంచుకుంటానని చెప్పారు.
ఎప్పుడైనా తాను గందరగోళానికి గురైతే వెంటనే ఆమెను సంప్రదిస్తానన్నారు.
తన మూడ్ మారిందని ఆమెకు వెంటనే అర్థమైపోతుందని, 'ఏం అయింది? ఎందుకు అలా ఉన్నావు?' అని అడుగుతుందన్నారు.
Details
ఫిబ్రవరి 7న తండేల్ రిలీజ్
ప్రతి విషయంలోనూ ఆమె ఇచ్చే సలహాలు, సూచనలు ఎంతో విలువైనవన్నారు. ఆమె నిర్ణయాలను తాను గౌరవిస్తానని చైతన్య తెలిపారు.
చై-శోభితా పెద్దల అంగీకారంతో వీరిద్దరూ 2023 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. శోభితా ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకొని, 2016లో సినీ రంగ ప్రవేశం చేశారు.
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను అందుకుంటున్నారు. నాగచైతన్య ప్రస్తుతం 'తండేల్' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.
చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించారు. ఫిబ్రవరి 7న సినిమా విడుదల కానుంది.