తదుపరి వార్తా కథనం
Nithin : నితిన్ 'తమ్ముడు' సినిమాపై సాలిడ్ అప్డేట్
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 13, 2024
01:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా తరువాత హీరో నితిన్ నటించబోయే , రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న తమ్ముడు చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఓ సాలిడ్ అప్డేట్ బయటకి వచ్చింది.
రేపు వైజాగ్‌లో కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించేందుకు టీమ్ సిద్ధంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
దాదాపు పది రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో నితిన్, మరికొందరు నటీనటులు చేరనున్నారు. కథానాయిక, ఇతర కీలక నటీనటుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
దిల్ రాజు తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కాంతార' సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.