LOADING...
Akhil-Lenin: సోలో రిలీజ్ అడ్వాంటేజ్‌.. 'లెనిన్'కు గోల్డెన్ ఛాన్స్
సోలో రిలీజ్ అడ్వాంటేజ్‌.. 'లెనిన్'కు గోల్డెన్ ఛాన్స్

Akhil-Lenin: సోలో రిలీజ్ అడ్వాంటేజ్‌.. 'లెనిన్'కు గోల్డెన్ ఛాన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 02, 2026
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఏజెంట్' వంటి డిజాస్టర్ తర్వాత హీరో అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంపై నాగార్జున ఇటీవల పాజిటివ్‌గా స్పందించడంతో అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఇది అఖిల్ కెరీర్‌కు కీలక మలుపు తిప్పే చిత్రమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వ

వివరాలు

జూన్ 26న రిలీజ్

ఇక 'లెనిన్' సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా కొనసాగిన అనిశ్చితికి తెరపడింది. వాయిదా పడుతుందన్న ప్రచారం ఉన్నప్పటికీ, తాజాగా పరిస్థితులు అనుకూలించాయి. రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' చిత్రాన్ని జూన్ 4న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో, ఎలాంటి పెద్ద పోటీ లేకుండా జూన్ 26న 'లెనిన్' సోలోగా విడుదలకు మార్గం సుగమమైంది. ఇతర భారీ చిత్రాల పోటీ లేకపోవడం 'లెనిన్'కు ప్రధాన ప్లస్ పాయింట్‌గా మారుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Advertisement