Soul Of Lenin: 'లెనిన్'లో కనిపించని సాంగ్.. ఇప్పుడు పూర్తి వీడియో రిలీజ్!
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమాతో కెరీర్‌లో తొలి భారీ విజయం దక్కింది. గత నెలలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని రూ.100 కోట్లకు పైగా వసూల్లు సాధించింది. ఇక ఈ విజయవంతమైన చిత్రం వచ్చే శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. సినిమా విడుదలకు ముందు చిత్రబృందం 'సోల్ ఆఫ్ లెనిన్' పేరుతో ఓ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. దీంతో ఆ పాట సినిమాలో కూడా ఉంటుందని అభిమానులు భావించారు. అయితే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులకు ఆ పాట కనిపించకపోవడంతో నిరాశ ఎదురైంది.
వివరాలు
ఎడిటింగ్ సమయంలో సాంగ్ ను తీసేశారు
ఎడిటింగ్ సమయంలో ఆ సాంగ్‌ను చిత్రం నుంచి తొలగించినట్లు తెలిసింది. ఇప్పుడు మాత్రం అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తూ 'సోల్ ఆఫ్ లెనిన్' పూర్తి వీడియో పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు.
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు.
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను నాగార్జున అక్కినేని, నాగవంశీ నిర్మించారు.
మహాభారతాన్ని రిఫరెన్స్‌గా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రంలో తొలి భాగం సాధారణంగా సాగినా, రెండో భాగంలో వరుస ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాను విజయవంతం